Bank Holiday: బుధవారమా..? గురువారమా..? తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు బక్రీద్ సెలవు ఎప్పుడంటే..!

ABN , First Publish Date - 2023-06-27T16:39:37+05:30 IST

బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యమైన అలెర్ట్. అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేసేందుకో, విత్‌డ్రా చేసుకునేందుకో, పాస్‌బుక్ పనుల కోసమో బ్యాంకులకు వెళ్లే వారి కోసం ముఖ్యమైన విషయం. బక్రీద్ సందర్భంగా ఈ వారంలో బ్యాంకులకు సెలవు ఉంది.

Bank Holiday: బుధవారమా..? గురువారమా..? తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు బక్రీద్ సెలవు ఎప్పుడంటే..!

బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యమైన అలెర్ట్. అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేసేందుకో, విత్‌డ్రా చేసుకునేందుకో, పాస్‌బుక్ పనుల కోసమో బ్యాంకులకు వెళ్లే వారి కోసం ముఖ్యమైన విషయం. బక్రీద్ సందర్భంగా ఈ వారంలో బ్యాంకులకు సెలవు ఉంది (Bakrid holiday). జూన్ 28, 29 తేదీల్లో బక్రీద్ లేదా ఈద్ ఉల్ అదా పండగ జరగబోతోంది. ఈ నేపథ్యంలో బక్రీద్ సెలవు బుధవారమా?, గురువారమా? అనే అనుమానం నెలకొంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ ప్రకటన జారీ చేసింది.

ఈ నెల 29వ తేదీన అంటే గురువారం నాడు బక్రీద్ సెలవు దినంగా ఆర్బీఐ ప్రకటించింది. ఆ రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా బ్యాంకులు పనిచేయవు (Bank Holidays). అయితే బేలాపుర్, జమ్మూ, కొచ్చి, ముంబై, నాగ్‌పుర్, శ్రీనగర్, తిరువనంతపురం వంటి చోట్ల 28వ తేదీన బక్రీద్ జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో బుధవారం బ్యాంకులు పని చేయవు. మిగిలిన ప్రాంతాల్లోనూ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బుధవారం బ్యాంకులు పని చేస్తాయి. గురువారం సెలవు ఉంటుంది.

Bank Deposit Form: ఇదేంటయ్యా సామీ.. బ్యాంకు వాళ్లు పెళ్లి సంబంధాలేమైనా చూస్తారనుకున్నావా ఏంటీ..?

ఈ నెలలో 15 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో సహా మొహర్రం, గురు హర్‌గోవింద్ జీ జయంతి, అషూరా, కేర్ పూజ సందర్భంగా బ్యాంకులకు సెలవులు. మొహర్రం సందర్భంగా అన్ని రాష్ట్రాల్లోనూ బ్యాంకులకు హాలిడే ఉంది. మిగిలిన రోజుల్లో ఆయా రాష్ట్రాలను బట్టి సెలవులు ఉంటాయి.

Updated Date - 2023-06-27T16:39:37+05:30 IST