Bald hair: జుట్టు బాగా ఊడిపోయి బట్టతల వచ్చేస్తోందా? ఈ 5టిప్స్ ఫాలో అయితే చాలు.. జరిగే మ్యాజిక్ చూసి మీరే ఆశ్చర్యపోతారు!!
ABN , First Publish Date - 2023-10-25T14:27:53+05:30 IST
ఒక్కసారి బట్టతల రావడం మొదలయ్యిందంటే ఇక అది కంట్రోల్ కాదని, జుట్టు పెరగడం అసాధ్యమని చాలామంది అంటూంటారు. కానీ ఈ 5 టిప్స్ పాలో అయితే మాత్రం..
జుట్టురాలడం అనే సమస్య ఇప్పట్లో చాలా మంది ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలే సమస్య తీవ్రమైతే బట్టతల వచ్చేస్తుంది. చిన్న వయసులోనే బట్టతల సమస్యను ఎదుర్కొంటున్నవారు చాలామందే ఉన్నారు. ఈ సమస్య అబ్బాయిలలోనే కాకుండా అమ్మాయిలలో కూడా కనిపిస్తుంది. ఒక్కసారి బట్టతల రావడం మొదలయ్యిందంటే ఇక అది కంట్రోల్ కాదని, జుట్టు పెరగడం అసాధ్యమని చాలామంది అంటూంటారు. కానీ కేవలం 5 టిప్స్ ఫాలో అయితే చాలు. బట్టతల రావడం ఆగిపోయి రాలిపోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు వస్తుంది(bald hair growing tips). జుట్టు ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది. బట్టతల మీద జుట్టు వచ్చేలా చేసే ఆ మ్యాజిక్ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..
మసాజ్..(oil massage)
జుట్టు రాలే సమస్యతో ఇబ్బందిపడుతున్నవారు తలకు ఆయిల్ మసాజ్ చేసుకుంటే హెయిర్ ఫాల్ మరింత పెరుగుతుందనే అపోహలో ఉంటారు. కానీ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల తలలో రక్తప్రసరణ మెరుగవుతుంది. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఆముదం, పిప్పరమెంట్ నూనె, కొబ్బరినూనె, రోజ్మెరీ ఆయిల్, జోజోబా ఆయిర్, గుమ్మడి గింజల నూనె, కలోంజి నూనె మొదలైనవి బట్టతల మీద జుట్టు పెరగడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
Viral: ఆన్లైన్ లో జాబ్స్ కోసం వెతుకుతుంటారా? ఓ కుర్రాడికి ఏం జరిగిందో తెలిస్తే..
ఆహారం..(food)
జుట్టుపెరుగుదలకు అవసరమైన పోషకాలు అందకపోతే జుట్టురాలడం క్రమంగా పెరుగుతుంది. అందుకే జుట్టు పెరుగుదలకు సహకరించే ఆహారాలు తీసుకోవాలి. విటమిన్-సి పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకుంటే జుట్టు రాలడం ఆగుతుంది. జుట్టు పెరుగుదలకోసం బయోటిన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. చికెన్, చేపలు, పప్పులు, బీన్స్ తినాలి. విటమిన్ -ఎ కోసం ఆకుకూరలు, బ్రోకలి, క్యారట్లు తీసుకోవాలి. పాలు, పెరుగు, పండ్లు, గుడ్లు, స్ట్రాబెర్రీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. నానబెట్టిన శనగలు, బాదం చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. రోజూ 3 నుండి 4 లీటర్ల నీరు తప్పనిసరిగగా తీసుకోవాలి. జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని అవాయిడ్ చెయ్యాలి.
జుట్టు సంరక్షణ..(hair care)
మంచి షాంపూ పెట్టుకుని స్నానం చెయ్యడం, తలకు చక్కగా ఆయిల్ పెట్టుకోవడంతో జుట్టు ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. జుట్టును పదే పదే దువ్వడం, జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వడం, తడి జుట్టును గట్టిగా రుద్దడం, వేడిగా ఉన్న నీరు తలస్నానానికి ఉపయోగించడం, రసాయనాలున్న ఉత్పత్తులు వాడటం కూడా జుట్టు బలహీనం అయి రాలిపోవడానికి దారితీస్తుంది. హెయిర్ స్టైల్ కోసం జుట్టును వేడి చేసే ఎలక్ట్రానిక్ సాధనాలు వాడటం, డ్రైయర్ ను ఎక్కువ ఉపయోగించడం కూడా జుట్టు దెబ్బతినేలా చేస్తుంది.
కొల్లాజెన్..(collagen)
కొల్లాజెన్ శరీరం యవ్వనంగా ఉండటంలో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు, జుట్టు ఒత్తుగా మారడానికి ఇది సహాయపడుతుంది. కొల్లాజెన్ ఆధారిత ఉత్పత్తులు వాడటం, కొల్లాజెన్ మెండుగా ఆహారం తినడం మంచిది.
విటమిన్స్, మినరల్స్..(vitamins, minerals)
విటమిన్-ఎ, బయోటిన్, విటమిన్-సి, విటమిన్-ఇ, ఐరన్ పుష్కలంగా శరీరానికి అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి లోపిస్తే జుట్టు రాలుతుంది.