Bank Holidays in August: ఆగస్టు నెలలో 14 రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులంటే..!
ABN , First Publish Date - 2023-07-26T19:14:01+05:30 IST
మరికొద్ది రోజుల్లో ఆగస్టు (August) నెల రాబోతోంది. ప్రతి నెలలోనూ బ్యాంకులు ఎప్పుడెప్పుడు పనిచేయవో తెలిపే జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) విడుదల చేస్తుంది. ఆర్బీఐ జాబితా ప్రకారం ఆగస్టు నెలలో 14 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు.
మరికొద్ది రోజుల్లో ఆగస్టు (August) నెల రాబోతోంది. ప్రతి నెలలోనూ బ్యాంకులు ఎప్పుడెప్పుడు పనిచేయవో తెలిపే జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) విడుదల చేస్తుంది. ఆర్బీఐ జాబితా ప్రకారం ఆగస్టు నెలలో 14 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. దేశంలోని బ్యాంకులు ఆదివారంతో పాటు రెండో, నాలుగో శనివారం సెలవులో ఉంటాయి. అలాగే వివిధ రాష్ట్రాల్లో స్థానిక పండగల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి వేసి ఉంటాయి (Bank holidays in August 2023).
సెలవు రోజుల్లో బ్యాంకులు మూసివేసి ఉన్నప్పటికీ ఆన్ లైన్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, యూపీఐ వంటి సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. అయితే బ్యాంకుకు వెళ్లి నేరుగా పూర్తి చేసుకోవాల్సిన పనులు ఉంటే మాత్రం తప్పకుండా సెలవులను గమనించుకోవాలి.
Viral Video: బైక్‌పై వెళ్తున్నారా..? ఎందుకయినా మంచిది ఒక్కసారి ఈ వీడియోను చూడండి.. రోడ్డు పక్కన కార్లు ఆగి ఉంటే..!
ఆగస్టు నెలలో బ్యాంకు సెలవులు..
ఆగస్టు 6: ఆదివారం
ఆగస్టు 8: టెండాంగ్ లో రమ్ ఫాట్ (సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో సెలవు)
ఆగస్టు 12- రెండో శనివారం
ఆగస్టు 13- ఆదివారం
ఆగస్టు 15- స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 16- పార్సీ నూతన సంవత్సరం (ముంబై, నాగ్‌పూర్, బేలాపూర్‌లో బ్యాంకులకు సెలవు)
ఆగస్టు 18- శ్రీమత శంకర్‌దేవ్ తిథి (గౌహతిలో బ్యాంకులకు సెలవు)
ఆగస్టు 20- ఆదివారం
ఆగస్టు 26- నాలుగో శనివారం
ఆగస్టు 27- ఆదివారం
ఆగస్టు 28- మొదటి ఓనం (కోచి, తిరువనంతపురంలో సెలవు)
ఆగస్టు 29- తిరుఓణం (కోచి, తిరువనంతపురంలో సెలవు)
ఆగస్టు 30- రాఖీ పండుగ (జైపూర్, సిమ్లాలో బ్యాంకులకు సెలవు)
ఆగస్టు 31- రక్షా బంధన్/ శ్రీ నారాయణ గురు జయంతి/ పాంగ్- లాబ్సోల్ (డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలో సెలవు)