Personal Loan: పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? అసలు ఏఏ బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి ఇస్తారంటే..!
ABN , First Publish Date - 2023-11-28T17:46:04+05:30 IST
అతి తక్కువ వడ్డీ రేటుపై పర్సనల్ లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే!
ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణాల్లోకెల్లా అత్యంత ఖరీదైనవి వ్యక్తిగత రుణాలన్న (Personal loans) విషయం తెలిసిందే. ఇంటి రుణం, కారు లోన్, గోల్డ్ లోన్.. ఇలా వేటితో పోల్చినా పర్సనల్ లోన్లపై వడ్డీ రేటే ఎక్కువ! కానీ అత్యవసర సందర్భాల్లో ఈ లోన్లు తీసుకోకతప్పదు. అలాంటప్పుడు.. కాస్తంత అవగాహనతో మసులుకుంటే వడ్డీ భారం కొంతలో కొంత తగ్గే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత రుణాలు కావాలనుకున్న వారు ముందుగా వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలను సంప్రదించి వడ్డీ రేట్లు, కాలపరిమితి వంటి అంశాలను పోల్చి చూడాలి. ఆ తరువాతే ఎక్కడ లోన్ తీసుకోవాలనే విషయంలో తుది నిర్ణయానికి రావాలి. మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి కాస్తంత తక్కువ వడ్డీకే లోన్ లభిస్తుంది. ఇక, ప్రస్తుతం అత్యంత తక్కువ వడ్డీకి( Lowest Interest Rates) పర్సనల్ లోన్లు ఇస్తున్న బ్యాంకులు ఏవో ఓమారు చూద్దాం.
Viral: చికెన్ శాండ్‌విచ్‌తో ఫ్లైట్ ఎక్కిన మహిళ..విమానంలో కునుకు తీయడంతో జరిగిందో దారుణం!
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank of Maharashtra) 10 శాతం వడ్డీపై పర్సనల్ లోన్లు ఇస్తోంది. 84 నెలల కాలపరిమితిపై గరిష్ఠంగా రూ.20 లక్షల వరకూ ఈ బ్యాంకులో వ్యక్తిగత రుణం పొందొచ్చు.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు(Punjab and Sind Bank).. 10.15 శాతం నుంచి 12.80 వడ్డీ రేటుపై పర్సనల్ లోన్లు ఇస్తోంది. అయితే లోన్ గరిష్ఠ పరిమితి రూ.3 లక్షలు. దీన్ని 60 నెలల లోపు చెల్లించాల్సి ఉంటుంది.
రూ.20 లక్షల వరకూ పర్సనల్ లోన్లపై బ్యాంక్ ఆఫ్ ఇండియా(Bank of India) కనీసం 10.52 శాతం వడ్డీ విధిస్తోంది. లోన్ గరిష్ఠ కాలపరిమితి 84 నెలలు.
Viral: వైద్య పరీక్షలకు వెళ్లిన వృద్ధుడు..ఆయన పెద్ద పేగులో ఏముందో చూసిన డాక్టర్లకు దిమ్మతిరిగే షాక్!
ఇండస్‌ఇండ్ బ్యాంకు(Indusind Bank) ఇచ్చే పర్సనల్ లోన్ల వడ్డీ రేట్లు 10.25 శాతం నుంచి 32.02 శాతం మధ్య ఉన్నాయి. కనీసం రూ. 30 వేల నుంచి గరిష్ఠంగా రూ.25 లక్షల వరకూ రుణం పొందొచ్చు. ఏడాది నుంచి 60 నెలలలోపు లోన్ మొత్తాన్ని చెల్లించాలి.
బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank Of Baroda) పర్సనల్ లోన్ల వడ్డీ రేట్లు 10.35 శాతం నుంచి 17.50 శాతం మధ్య అందుబాటులో ఉన్నాయి. కనీసం రూ.50 వేల నుంచి గరిష్ఠంగా రూ.20 లక్షల వరకూ లోన్లు జారీ చేస్తోంది. లోన్ చెల్లింపు కాలవ్యవధి 48 నెలల నుంచి గరిష్ఠంగా 60 నెలల వరకూ ఉంది.
Viral: విసిగిపోయిన భారతీయ రెస్టారెంట్.. బ్రిటన్ ప్రజలకు ఊహించని వార్నింగ్!