ఎన్ని ప్రయత్నాలు చేసినా పొట్టతగ్గడం లేదా? ఈ 3రకాల గింజలు తిని చూడండి.. నిజంగా అద్భుతం చేస్తాయివి..

ABN , First Publish Date - 2023-06-19T11:33:44+05:30 IST

శరీరంలో కొన్ని భాగాల్లో చాలా సులువుగా కొవ్వు పేరుకుపోయి బాడీ షేప్ ను పాడుచేస్తుంది. ఇలా శరీరంలో కొవ్వు పేరుకుపోయే భాగాల్లో పొట్ట(Belly) ముఖ్యమైనది. ఇప్పటికాలం ఉద్యోగాలన్నీ సిస్టమ్ ల ముందు కూర్చుని చేసేవే కావడం వల్ల మహిళలకు, పురుషులకు కూడా ఈ పొట్ట పెద్ద సమస్యగా మారింది. పొట్ట, నడుము చుట్టూ కొవ్వు తగ్గించుకోవడానికి ఎన్నో మార్గాలు అనుసరిస్తుంటారు. కానీ ఈ మూడు రకాల గిెంజలు తీసుకుంటూ ఉంటే మ్యాజిక్ జరుగుతుంది.

ఎన్ని ప్రయత్నాలు చేసినా పొట్టతగ్గడం లేదా? ఈ 3రకాల గింజలు తిని చూడండి.. నిజంగా అద్భుతం చేస్తాయివి..

అందంగా నాజూగ్గా కనిపించాలని అందరూ కోరుకుంటారు. కానీ శరీరంలో కొన్ని భాగాల్లో చాలా సులువుగా కొవ్వు పేరుకుపోయి బాడీ షేప్ ను పాడుచేస్తుంది. ఇలా శరీరంలో కొవ్వు పేరుకుపోయే భాగాల్లో పొట్ట(Belly) ముఖ్యమైనది. ఇప్పటికాలం ఉద్యోగాలన్నీ సిస్టమ్ ల ముందు కూర్చుని చేసేవే కావడం వల్ల మహిళలకు, పురుషులకు కూడా ఈ పొట్ట పెద్ద సమస్యగా మారింది. పొట్ట, నడుము చుట్టూ కొవ్వు తగ్గించుకోవడానికి ఎన్నో మార్గాలు అనుసరిస్తుంటారు. జిమ్ లో గంటల కొద్ది కష్టపడుతుంటారు. అయితే ఇలా వ్యాయామంతో పాటు ఈ మూడు రకాల గింజలు(3type seeds for belly fat) రోజూ స్నాక్స్ లో భాగంగా తీసుకుంటే అద్భుతం జరుగుతుంది. ఊహించని రీతిలో పొట్ట, నడుము భాగాల్లో కొవ్వు వేగంగా తగ్గిపోతుంది. పొట్ట తగ్గించుకోవాలని ట్రై చేసే ప్రతీ ఒక్కరూ తీసుకోవాల్సిన ఆ గింజలు ఏమిటో తెలుసుకుంటే..

పొద్దు తిరగుడు విత్తనాలు..(sunflower seeds)

సన్ ఫ్లవర్ సీడ్స్ చిన్నతనం నుండి అందరికీ పరిచయంలో ఉన్నవే.. అయితే పెరిగి పెద్దయిన తరువాత వీటిని తినడం మానేశారు చాలామంది. ఈ పొద్దు తిరుగుడు విత్తనాలు పొట్ట కొవ్వును తగ్గించడంలో, బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి(sunflower seeds to reduce belly fat). పొద్దు తిరుగుడు విత్తనాలు తీసుకోవడం వల్ల పేగులు శుభ్రపడి, జీర్ణవ్యవస్థ సాఫీగా సాగుతుంది. ఈ విత్తనాలు జుట్టు పెరుగుదలకు కూడా సహకరిస్తాయి. వీటిని గ్రైండ్ చేసి సూపులలోనూ, సలాడ్ లలోనూ, టీ, హెల్త్ డ్రింక్స్ మొదలైన రూపాల్లో పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకోవచ్చు. లేకపోతే వేయించిన విత్తనాలను కొద్దిగా నేరుగానే తినవచ్చు.

Sim Cards: మీ ఐడీతో ఎవరైనా సిమ్ కార్డ్ తీసుకుని ఉపయోగిస్తున్నారని సందేహమా? మీకు తెలియకుండా జరిగే మోసాన్ని ఇలా కనిపెట్టేయండి..


అవిశె గింజలు.. (flax seeds)

అవిశె గింజలను చర్మసంరక్షణలో, కేశ సంరక్షణలో విరివిగా ఉపయోగిస్తుంటారు. అవిశె గింజలు శరీరానికి అవసరమైన ఎన్నో లిపిడ్స్ ను(lipids) కలిగి ఉంటాయి. ఇందులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్(omega 3 fatty acids) శరీరంలో అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఫైబర్, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కూరగాయలతో అయినా లేక పెరుగు, పరాటాలు, స్మూతీస్ మొదలైనవాటిలో ఈ అవిశె గింజలు జోడించుకోవడం వల్ల పొట్ట భాగంలో పేరుకున్న కొవ్వు చాలా తొందరగా తగ్గుతుంది.

చియా గింజలు.. (chia seeds)

ఈ మధ్య కాలంలో చియా గింజల వాడకం పెరిగింది. చాలామంది వీటిని వివిధ డ్రింక్స్ లో భాగంగా ఉపయోగిస్తుంటారు. అయితే చియా గింజలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా(chia seeds for breakfast) తీసుకుంటే మంచిది. ఇవి చాలా నెమ్మదిగా అరుగుతాయి. జీర్ణాశయ పనితీరును వేగవంతం చేస్తాయి. ఈ కారణం వల్ల పొట్టభాగంలో పేరుకున్న కొవ్వు చాలా తొందరగా కరుగుతుంది. అయితే చియా గింజలు, అవిశె గింజలు బాగా వేడి చేస్తాయి. ఈ కారణంగా వీటిని తీసుకోవాలని అనుకునేవారు నీరు, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి.

Corn Silk: మొక్కజొన్న తినే అందరూ చేస్తున్న మిస్టేక్ ఇదే.. పనికిరాదని చెత్తబుట్టలోకి వేస్తుంటారు కానీ..


Updated Date - 2023-06-19T13:48:18+05:30 IST