Viral: ఈ ఆటో డ్రైవర్ ఎంతో మందికి స్ఫూర్తి.. 38 ఏళ్ల క్రితం వదిలేసిన చదువు మళ్లీ మొదలు పెట్టి..

ABN , First Publish Date - 2023-08-29T13:57:46+05:30 IST

ఈ వ్యక్తి బెంగళూరులో ఆటో డ్రైవర్.. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తండ్రి.. 38 ఏళ్ల క్రితం పదో తరగతి పరీక్షలు పాసైన తర్వాత ఆర్థిక స్థోమత సరిపోక పోవడం వల్ల చదువు ఆపేశాడు.. అప్పట్నుంచి ఆటో నడుపుకుంటున్నాడు.. ప్రస్తుతం అతడి పిల్లలు హైస్కూలు చదువులు చదువుతున్నారు..

Viral: ఈ ఆటో డ్రైవర్ ఎంతో మందికి స్ఫూర్తి.. 38 ఏళ్ల క్రితం వదిలేసిన చదువు మళ్లీ మొదలు పెట్టి..

ఈ వ్యక్తి బెంగళూరు (Bengaluru)లో ఆటో డ్రైవర్ (Auto Driver).. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తండ్రి.. 38 ఏళ్ల క్రితం పదో తరగతి పరీక్షలు పాసైన తర్వాత ఆర్థిక స్థోమత సరిపోక పోవడం వల్ల చదువు ఆపేశాడు.. అప్పట్నుంచి ఆటో నడుపుకుంటున్నాడు.. ప్రస్తుతం అతడి పిల్లలు హైస్కూలు చదువులు చదువుతున్నారు.. 38 ఏళ్ల క్రితం ఆపేసిన చదువును మళ్లీ ప్రారంభించాలని ఆ ఆటో డ్రైవర్ నిర్ణయించుకున్నాడు.. ప్రస్తుతం పీయూసీ పరీక్షలకు (PUC Exams) హాజరవుతున్నాడు. ఓ నెటిజన్ ఇతడి గురించి తెలుసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

బెంగుళూరుకు చెందిన నిధి అగర్వాల్ అనే ట్విటర్ యూజర్ ఇటీవల చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Tweet) అవుతోంది. బెంగళూరులో ఓలా ఆటో నడుపుతున్న భాస్కర్ అనే వ్యక్తి 38ఏళ్ల తర్వాత మళ్లీ చదువు ప్రారంభించారని ఆమె పేర్కొన్నారు. ``ఈరోజు నా @Olacabs ఆటో మేట్ బాస్కర్ ని పరిచయం చేస్తున్నాను. అతను ఈ రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్‌ రాశాడు. అతను 1985లో 10వ తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఈ సంవత్సరం PUC పరీక్షలు రాశాడు. అతడు ఇద్దరు పిల్లల్లో ఒకరు 3వ తరగతి, 6వ తరగతి చదువుతున్నారు. ఆటో డ్రైవర్‌ బాస్కర్‌ ఎంతో మందికి ఆదర్శం అని పేర్కొన్నారు.

Viral Video: వామ్మో.. ఈమె నిజంగా లేడీ బాహుబలే.. అంత బలమైన దుంగలను ఎలా మోసుకెళ్తోందో చూడండి..

నిధి అగర్వాల్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 1600 మందికి పైగా ఈ ట్వీట్‌ను వీక్షించారు. భాస్కర్‌ను ప్రశంసిస్తూ చాలా మంది కామెంట్లు చేశారు. ``చదువుకోడానికి వయోపరిమితి లేదు``, ``చదువుకోవాలనే తపన ఉండాలే గానీ, ఏ వయసు వారైనా సరే తమ చదువును కంటీన్యూ చెయొచ్చు`` అని పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-08-29T13:57:46+05:30 IST