అతను ఐటీ ఇంజినీరు.. 73 ఏళ్ల తల్లి ఆవేదనను అర్థం చేసుకుని.. ఉద్యోగానికి రాజీనామా చేసి, ఏం చేస్తున్నాడంటే...

ABN , First Publish Date - 2023-04-13T12:38:49+05:30 IST

తల్లిండ్రులకు అమితమైన సేవ చేసిన శ్రవణ్ కుమారుని కథ మనమంతా చిన్నతనంలో వినేవుంటాం. అయితే చాలా తక్కువ మంది మాత్రమే తమ జీవితంలో ఇటువంటి విలువలను ఆచరించగలుగుతారు.

అతను ఐటీ ఇంజినీరు.. 73 ఏళ్ల తల్లి ఆవేదనను అర్థం చేసుకుని.. ఉద్యోగానికి రాజీనామా చేసి, ఏం చేస్తున్నాడంటే...

తల్లిండ్రులకు అమితమైన సేవ చేసిన శ్రవణ్ కుమారుని కథ మనమంతా చిన్నతనంలో వినేవుంటాం. అయితే చాలా తక్కువ మంది మాత్రమే తమ జీవితంలో ఇటువంటి విలువలను ఆచరించగలుగుతారు. కాగా కర్నాటక(Karnataka)కు చెందిన కృష్ణకుమార్ ఒక బహుళజాతి కంపెనీ(multinational company)లో ఉద్యోగం వదిలేసి మాతృ సేవ చేస్తున్నాడు. తన తల్లిని స్కూటర్‌పై ఇండియా టూర్‌కి తీసుకెళ్తున్నాడు. ఇప్పటికే కృష్ణకుమార్ తన తల్లితో కలిసి ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)ను సందర్శించాడు.

డాక్టర్ దక్షిణామూర్తి కృష్ణ కుమార్ కర్ణాటకలోని మైసూర్‌లోని బోగాడి నివాసి. కృష్ణ కుమార్ (42) ఒక బహుళజాతి కంపెనీ ఇంజనీర్. అతని తల్లి కుటుంబంలోని 10 మందికి వండివారుస్తూ, ఉమ్మడి కుటుంబం(joint family)లోని ఇంటి పనులన్నీ చేస్తుంటుంది. ఒకరోజు కంపెనీ నుండి ఇంటికి వచ్చిన కృష్ణ కుమార్ కొన్ని ఆలయాల(Temples) పేర్లను చెబుతూ వీటిని ఎప్పుడైనా సందర్శించావా అని తల్లిని అడిగాడు. ఆమె కన్నీరు పెట్టుకుంటూ ఇప్పటి వరకు నేను ఇంటి దగ్గర ఉన్న గుడికి కూడా వెళ్లలేకపోయానని తెలిపింది. వెంటనే కృష్ణకుమార్ తల్లికి(mother) దేశంలోని అన్ని ఆలయాలను చూపించాలని నిర్ణయించుకున్నాడు.

కృష్ణ కుమార్ గత ఐదేళ్లుగా శ్రవణ్ కుమారుని పాత్ర పోషిస్తున్నాడు. కృష్ణ కుమార్ తన 73 ఏళ్ల తల్లిని తన పాత స్కూటర్‌(old scooter)పై కూర్చోబెట్టుకుని దేశమంతా తిప్పుతున్నాడు. వారు ఇప్పటి వరకు నేపాల్, భూటాన్(Bhutan), మయన్మార్‌లను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో కృష్ణ కుమార్ మాట్లాడుతూ తమ ప్రయాణం ఎప్పటికి పూర్తవుతుందో కూడా తమకు తెలియదన్నారు. వీలైనంత వరకు తన తల్లికి దేశంలోని అన్ని ఆలయాలు చూపించాలనేదే తన లక్ష్యం(goal) అని పేర్కొన్నారు. తాను సంపాదించిన డబ్బుతోనే ఈ తీర్థయాత్రలు(Pilgrimages) చేస్తున్నానని కృష్ణ కుమార్ తెలిపారు.

Updated Date - 2023-04-13T12:54:33+05:30 IST