Bengaluru Woman: అద్దె ఇంటికోసం ఆ మహిళ వెతుకుతోంటే మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటీ..? ఓ వ్యక్తి నుంచి వింత ప్రపోజల్..!
ABN , First Publish Date - 2023-09-16T16:37:02+05:30 IST
బెంగళూరులో అద్దెకు ఇల్లు దొరకడం అంటే మాటలు కాదు. అందులోనూ బ్యాచిలర్స్‌కు ఇల్లు దొరకడం మరీ గగనం. ఒకవేళ దొరికినా అద్దె చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓనర్లు పెట్టే కండీషన్లు, వారు అడిగే ప్రశ్నలు ఒక రేంజులో ఉంటాయి. తాజాగా బెంగళూరులో అద్దె ఇంటి కోసం వెతుకుతున్న ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది.
టెక్ నగరం బెంగళూరు (Bengaluru)లో అద్దెకు ఇల్లు (Rented house) దొరకడం అంటే మాటలు కాదు. అందులోనూ బ్యాచిలర్స్‌కు ఇల్లు దొరకడం మరీ గగనం. ఒకవేళ దొరికినా అద్దె చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓనర్లు పెట్టే కండీషన్లు, వారు అడిగే ప్రశ్నలు ఒక రేంజులో ఉంటాయి. తాజాగా బెంగళూరులో అద్దె ఇంటి కోసం వెతుకుతున్న ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. ఒక అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన ప్రపోజల్‌కు ఆమె షాకైంది. ఆమె తనకు ఎదురైన అనుభవాన్ని ట్విటర్ (X) ద్వారా తెలియజేసింది (Rents in Bengaluru).
ఆకాంక్షా మిశ్రా అనే కంటెంట్ రైటర్.. తనతో ఓ అపరిచితుడు చేసిన వాట్సాప్ చాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బెంగళూరులో ఓ అద్దె ఇంటి కోసం ఆకాంక్ష వెతుకుతోంది. ఆ విషయం తెలుసుకున్న ఓ వ్యక్తి ఆమెకు మెసేజ్ పంపించాడు. తాను కూడా మంచి ఏరియాలో ఇంటి కోసం చూస్తున్నానని, ఇబ్బంది లేకపోతే తనతో పాటు కలిసి ఫ్లాట్ షేర్ చేసుకోవచ్చని ఆఫర్ చేశాడు (Flat Sharing). అయితే అందుకు ఆకాంక్ష అంగీకరించలేదు. తనకు మేల్ ఫ్లాట్‌మేట్ అక్కర్లేదని చెప్పింది. అందుకు ఆ వ్యక్తి స్పందిస్తూ ``మీరు సింగిల్ అయితే మన జీవితం కోసం స్థలాన్ని పంచుకుందాం`` అని ప్రపోజ్ చేశాడు (Viral News).
Viral Video: దీన్ని తినడం కంటే కాస్త విషం తాగడం బెటర్.. అంటూ నెటిజన్ల సెటైర్లు.. ఐస్‌క్రీమ్‌ను దేనితో తయారు చేశారో చూస్తే..!
ఆకాంక్ష ఆ చాట్ స్క్రీన్ షాట్‌ను ట్విటర్ (X)లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటివరకు దాదాపు 3500 మంది ఈ ట్వీట్‌ను వీక్షించారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు బాగా స్పందించారు. ``అతను చాలా ఫాస్ట్‌గా ఉన్నాడు``, ``అలాంటివి నమ్మి ట్రాప్‌లో పడకూడదు``, ``అతని మాటల్లో నాకేం తప్పు కనిపించలేదు. దీనికి ఇంత మెలోడ్రామా ఎందుకు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.