Bhavish Aggarwal: ప్రేయసి దగ్గర అప్పులు చేసి మరీ పెట్టిన కంపెనీయే.. ఇప్పుడు ఫుల్లు ఫేమస్.. ఇతడెవరో గుర్తు పట్టారా..?
ABN , First Publish Date - 2023-08-02T10:21:44+05:30 IST
మగవాళ్లు వ్యాపారము, పెట్టుబడి అనే పేరు చెప్పి ఆడవాళ్ల నగలు, సేవింగ్స్ డబ్బులు అడిగితే ఆడవారు ఇంతెత్తున విరుచుకుపడుతుంటారు. ఎక్కడ డబ్బు నాశనం చేస్తారో అని భయపడతారు. కానీ భవిష్ ప్రేయసి మాత్రం అతన్ని తక్కువ అంచనా వేయలేదు.
ప్రతి మగవాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది అనేది ఎప్పటినుండో ఉన్నమాట. కొత్త వ్యాపారాలు, వ్యాపారాలలో ప్రయోగాలు చేసి సక్సెస్ అయిన ప్రతి మగవాడి వెనుక ఖచ్చితంగా ఓ మహిళ తోడ్పాటు, ప్రోత్సాహం ఉంటుంది. భవిష్ అగర్వాల్ సక్సెస్ వెనుక తన ప్రేయసి ఉంది. మగవాళ్లు వ్యాపారము, పెట్టుబడి అనే పేరు చెప్పి ఆడవాళ్ల నగలు, సేవింగ్స్ డబ్బులు అడిగితే ఆడవారు ఇంతెత్తున విరుచుకుపడుతుంటారు. ఎక్కడ డబ్బు నాశనం చేస్తారో అని భయపడతారు. కానీ భవిష్ ప్రేయసి మాత్రం అతన్ని తక్కువ అంచనా వేయలేదు. అతను అనుకుంటే సాధించగలడనే నమ్మకంతో అతన్ని ప్రోత్సహించింది. తన కారు అమ్మి మరీ అతనికి డబ్బు సమకూర్చింది. ఇలా భవిష్ కొత్త ప్రయాణం మొదలైంది. ప్రేయసి తోడ్పాటు, అతని ఆలోచనల సమిష్టి ఫలితంగా కంపెనీ ఫుల్లు ఫేమస్ అయ్యింది. దేశ ప్రజలకు అందరికీ ఈ కంపెనీ నిజంగా గొప్ప వరమనే చెప్పవచ్చు. ఐఐటీ బాంబేలో చదివి, మైక్రోసాఫ్ట్ లో మంచి ఉద్యోగం తెచ్చుకున్నా.. చేజేతులా దాన్ని వదిలి మరీ కొత్తదారి పట్టడం వెనుక గల కారణం, ఆయన సక్సెస్ స్టోరీ తెలుసుకుంటే..
హైదరాబాద్(Hyderabad), బెంగుళూరు(Bengaluru) వంటి మెట్రో నగరాల్లో ప్రయాణానికి చాలామంది ఉపయోగించే ఆప్షన్ క్యాబ్ సర్వీస్(cab service). ఓలా క్యాబ్స్(Ola cabs) దేశం మొత్తం మీద పేరు పొందిన క్యాబ్ సర్వీస్. ఈ కంపెనీ భవిష్ అగర్వాల్(Bhavish Agarwal) ఆలోచనలతో రూపుదిద్దుకుంది. భవిష్ అగర్వాల్ 2007లో ఐఐటీ బాంబేలో(IIT Bombay) ఇంజనీరింగ్ లో చేరాడు. ఇంజనీరింగ్ పూర్తీ చేసిన తరువాత మైక్రోసాప్ట్(Microsoft) కంపెనీలో అతనికి మంచి ఉద్యోగం లభించింది. చక్కని చదువు, ఆ తరువాత మంచి ఉద్యోగం లభించేసరికి జీవితంలో ఇక హ్యాపీగా సెటిల్ అయిపోయినట్టే అని కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా సంబరపడ్డారు. ఈ క్రమంలో అతను తన స్నేహితుడితో కలిసి బెంగుళూరు నుండి బందీపూర్ కు ప్రయాణమయ్యాడు. ఇందుకోసం ఓ టాక్సీని అద్దెకు తీసుకున్నారు. అయితే ఆ టాక్సీ డ్రైవర్ మైసూరులో వాహనం ఆపేశాడు. వారు ముందు మాట్లాడుకున్న దానికంటే ఎక్కువ అద్దె చెల్లిస్తేనే తను బందీపూర్ చేరుస్తానని డిమాండ్ చేశాడు. దీంతో భవిష్, అతని స్నేహితుడు ఇద్దరూ టాక్సీని వదులుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత వారు ఇబ్బందులు పడి బస్ స్టాండ్ చేరుకుని బస్సులో వెళ్ళారు. ఈ సంఘటన తరువాత భవిష్ కు సౌకర్యవంతంగా, తక్కువ ధరలో టాక్సీ సేవలు(Taxi service) అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన తరువాత తన ఉద్యోగాన్ని వదిలేస్తున్నట్టు, తాను క్యాబ్ సర్వీస్ ప్రారంభించాలని అనుకున్నట్టు ఇంట్లో చెప్పాడు. ఇంత మంచి ఉద్యోగాన్ని వదిలి ట్రావెల్ ఏజెంట్ గా మారడం ఏంటని కుటుంబ సభ్యులు విస్తుపోయారు. కానీ అతను మాత్రం తన ఆలోచనను విరమించుకోలేదు. 2011లో ముంబైలోని పోబైలో సింగిల్ బెడ్ రూమ్ గల ఇంటిలో ఓలా క్యాబ్స్ కార్యాలయం ప్రారంభించాడు.
Amazon Great Freedom Festival Sale: అమెజాన్ సేల్ వచ్చేస్తోంది.. ఏఏ వస్తువులపై ఎంతెంత డిస్కౌంట్ ఇస్తోందంటే..!
ఇతను ఓలా క్యాబ్స్ ను ప్రారంభించినప్పుడు వ్యాపారం కొత్తలో అందరూ ఎదుర్కొన్నట్టుగానే ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మరీ ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఇతన్ని చుట్టుముట్టాయి. ఆ సమయంలో తనతోపాటు ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చదివిన తన ప్రియురాలు రాజ్యలక్ష్మి అండగా నిలబడింది. అతనికి సంబంధించిన బిల్లులు చెల్లించడం నుండి అన్ని విధాలుగా అతనికి సహాయం చేసింది. భవిష్ చివరికి ఆమె కారును కూడా అమ్మి ఆ డబ్బును అప్పుగా తీసుకున్నాడు. 2012లో టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ నుండి 50లక్షల పెట్టుబడి భవిష్ కు లభించింది. దీంతో ఓలా క్యాబ్స్ రేంజ్ పెరిగింది. ఆ తరువాత మరికొన్ని పెట్టుబడులు ఈ సంస్థ తలుపు తట్టాయి. భవిష్ ఒకప్పటి ప్రేయసి, ఇప్పటి భార్య అయిన రాజ్యలక్ష్మి Ernst & Young లో మార్కేటింగ్ మేనేజర్ గా, అనలిస్ట్ గా పనిచేసేవారు. ఈమె 2016 తరువాత ఓలా పౌండేషన్ లో చేరారు. ఓలా సంస్థ ప్రజల జీవితాల్లో సానుకూలంగా ఒదిగిపోయేందుకు ఆమె తన వంతు తోడ్పాటును అందిస్తోంది.