Zomato: అంకితా.. ఇక చాలమ్మా.. నీ మాజీ ప్రియుడు డబ్బులివ్వడం లేదంటూ.. జొమాటో ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదుగా..!

ABN , First Publish Date - 2023-08-03T20:54:10+05:30 IST

ఓ యువతి చేసిన పనికి అంతపెద్ద జోమాటో సంస్థకే దిమ్మతిరిగింది. ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఇక చాలంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది.

Zomato: అంకితా.. ఇక చాలమ్మా.. నీ మాజీ ప్రియుడు డబ్బులివ్వడం లేదంటూ.. జొమాటో ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదుగా..!

ఇంటర్నెట్ డెస్క్: ఓ యువతి చేసిన పనికి అంతపెద్ద జోమాటో సంస్థకే దిమ్మతిరిగింది. ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఇక చాలంటూ యువతికి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. దీంతో, జొమాటో ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. యువతి చేసిన పని చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.


పూర్తి వివరాల్లోకి వెళితే, భోపాల్‌కు చెందిన అంకితా(Ankita from Bhopal) అనే యువతి తన మాజీ ప్రియుడికి తరచూ జోమాటోలో(Zomato) ఫుడ్ ఆర్డరిస్తోంది. అయితే, బిల్లు ముందస్తుగా ఆన్‌లైన్‌లో చెల్లించే బదులు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్(Cash on delivery) ఎంచుకుంటోంది. అంటే, ఫుడ్ డెలివరీ అయ్యాకే మాజీ ప్రియుడే డబ్బు చెల్లించాలన్నమాట. మాజీ ప్రియుడిని మళ్లి సొంతం చేసుకునేందుకు ఇలా చేస్తోందో ఏమో తెలీదు కానీ ఆమె చేసిన పనికి జొమాటో డెలివరీ బాయ్‌లు చుక్కలు కనిపించడం ప్రారంభించాయి. ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వాళ్లు అతడి ఇంటికి వెళ్లిన ప్రతిసారీ మాజీ ప్రియుడు డబ్బు చెల్లించకుండా మొండికేశాడు. దీంతో, వారు జొమాటో వారికి ఫిర్యాదు చేయడంతో విషయం చివరకు ఇలా సోషల్ మీడియా బాట పట్టింది(Viral).


పరిస్థితి చేయి దాటుతోందని జొమాటో భావించిందో ఏమో తెలీదు కానీ..అంకితా ఇక ఆపమ్మా అంటూ జొమాటో పబ్లిక్‌గా మొరపెట్టుకుంది. అమ్మా..భోపాల్‌కు చెందిన అంకితా..క్యాష్ ఆన్ డెలివరీతో నీ మాజీ ప్రియుడికి ఫుడ్ పంపించడం ఇకనైనా ఆపు. అతడు డబ్బులు చెల్లించట్లేదు. ఇప్పటికే ఇది మూడోసారి! అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. మరికొందరు మాత్రం జొమాటో అద్భుతమైన మార్కెటింగ్ స్టంట్‌కు తెరలేపిందంటూ ప్రశంసలు కురిపించారు.

Updated Date - 2023-08-03T20:56:28+05:30 IST