Viral News: కరెంటు బిల్లు తగ్గించేందుకు ఓ వ్యక్తి వింత టెక్నిక్.. ఒక్క స్విచ్ వేస్తే మూడు ఫ్యాన్లు తిరిగేలా పక్కా ప్లాన్..
ABN , First Publish Date - 2023-07-10T16:02:38+05:30 IST
అవసరం ఎన్నో ఆలోచనలను సృష్టిస్తుంది అంటారు. అవసరంలో ఉన్న వ్యక్తి తన తెలివిని, మేథస్సును ఉపయోగించి, సృజనాత్మకంగా ఆలోచించి సరికొత్త ఆవిష్కరణలు చేస్తారు. ముఖ్యంగా భారతీయులకు అలాంటి క్రియేటివిటీ ఎక్కువ అని అంటుంటారు. తాజాగా ఓ వ్యక్తి కరెంట్ బిల్లు తగ్గించేందుకు వింత టెక్నిక్ ఉపయోగించాడు.
అవసరం ఎన్నో ఆలోచనలను సృష్టిస్తుంది అంటారు. అవసరంలో ఉన్న వ్యక్తి తన తెలివిని, మేథస్సును ఉపయోగించి, సృజనాత్మకంగా (Creativity) ఆలోచించి సరికొత్త ఆవిష్కరణలు చేస్తారు. ముఖ్యంగా భారతీయులకు అలాంటి క్రియేటివిటీ ఎక్కువ అని అంటుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చే వాటిని తయారు చేసే విషయంలో భారతీయులు మిగతా వారితో పోలిస్తే ముందుంటారు. అలాంటి వీడియోలు (Jugaad Videos) ఇప్పటికే ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఓ వ్యక్తి కరెంట్ బిల్లు (Current bill) తగ్గించేందుకు సరికొత్త టెక్నిక్ ఉపయోగించాడు.
బీహార్‌కు చెందిన ఓ ఇంజనీర్ (Bihar Engineer) ఒక్క స్విచ్ వేస్తే మూడు ఫ్యాన్లు (Three ceiling fans) తిరిగేలా డిజైన్ చేశాడు. అంటే ఒక మోటారుతో మూడు సీలింగ్ ఫ్యాన్లను కలిపాడు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ (Viral Photo) అవుతోంది. వైరల్ అవుతున్న ఆ ఫోటోలో, మూడు సీలింగ్ ఫ్యాన్‌లు కనిపిస్తున్నాయి. వాటిల్లో ఒక ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు, మిగిలిన రెండు కూడా ఆటోమేటిక్‌గా తిరిగేలా వైర్ సహాయంతో కనెక్ట్ చేశాడు. అలాంటి కనెక్ట్ చేసిన తీరు కూడా గజిగజిబిజిగా లేకుండా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు నీట్‌గా ఉంది.
Viral Video: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో.. ఏకంగా 19 మంది ప్రయాణీకులను విమానంలోంచి దించేయడం వెనుక..!
ఈ ఫొటోను శైలేంద్ర బిహారీ అనే ఫేస్‌బుక్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫేస్‌బుక్ పోస్ట్‌పై ఇప్పటివరకు 67 వేల రియాక్షన్స్, 2500కి పైగా షేర్లు వచ్చాయి. ఈ ఫొటోపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. ఆ ఇంజనీర్ ఆలోచనను ప్రశంసిస్తున్నారు. ``గొప్ప ఆలోచన``, ``ఇతనికి అవార్డు ఇవ్వాలి``, ``మూడు ఫ్యాన్లు వేసిన తక్కువ కరెంట్ బిల్లు`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు.