ఆగకుండా 11 రోజులు వలస వెళ్లిన పక్షి... ఎంత దూరం ప్రయాణించిందంటే...

ABN , First Publish Date - 2023-01-09T08:59:45+05:30 IST

మారుతున్నరుతువులలో పక్షులు తమ ఆహారం, నీటిని వెతుక్కునేందుకు దూర ప్రాంతాలకు తరలివెళుతుంటాయి. ఇదే కోవలో ఒక పక్షి గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్స్‌లో తన ఘనతను నమోదు చేసుకుంది.

ఆగకుండా 11 రోజులు వలస వెళ్లిన పక్షి... ఎంత దూరం ప్రయాణించిందంటే...

మారుతున్నరుతువులలో పక్షులు తమ ఆహారం, నీటిని వెతుక్కునేందుకు దూర ప్రాంతాలకు తరలివెళుతుంటాయి. ఇదే కోవలో ఒక పక్షి గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్స్‌లో తన ఘనతను నమోదు చేసుకుంది. బార్-టెయిల్డ్ గాడ్‌విట్ అనే పక్షిని ట్యాగ్ నంబర్ 234684 ద్వారా గుర్తిస్తారు. ఇది తన ఆహారం, విశ్రాంతి కోసం అలాస్కా నుండి ఆస్ట్రేలియా రాష్ట్రమైన టాస్మానియా వరకు 8,435 మైళ్ల దూరం ప్రయాణించింది.

బార్-టెయిల్డ్ గాడ్‌విట్ ఎక్కడా ఆగకుండా టాస్మానియాకు తరలివెళ్లింది. ఇందుకోసం ఈ పక్షిచేసిన 11 రోజుల వలస ప్రయాణాన్ని ఉపగ్రహ ట్యాగ్ ద్వారా ట్రాక్ చేశారు. 11 రోజుల్లో అలాస్కా నుండి టాస్మానియా వరకు మొత్తం 13,560 కిలోమీటర్ల (8,435 మైళ్ళు) దూరం ప్రయాణించినట్లు గుర్తించారు. రికార్డ్ కీపింగ్ ఆర్గనైజేషన్ తెలిపిన వివరాల ప్రకారం “ఆ పక్షి కవర్ చేసిన దూరం లండన్- న్యూయార్క్ మధ్య రెండు ప్రయాణాలకు సమానం. ఆ పక్షి దిగువ పొత్తికడుపునకు జోడించిన 5జీ శాటిలైట్ ట్యాగ్ ప్రకారం, దాని ప్రయాణం 11 అక్టోబర్ 2022న ప్రారంభమైంది. అది 11 రోజుల పాటు ఆగకుండా ఎగిరింది.

బార్-టెయిల్డ్ గాడ్‌విట్ గతంలో ఉన్న 217 మైళ్ల రికార్డును బద్దలు కొట్టి కొత్త రికార్డును నెలకొల్పింది. 2020 సంవత్సరంలో అదే జాతికి చెందిన మరో పక్షి 217 మైళ్ల దూరం ప్రయాణించి రికార్డు నెలకొల్పింది. ఈ పక్షి పరిమాణం యుద్ధ విమానంలా ఉంటుంది. దాని పొడవాటి కోణాల రెక్కలు గాలిలో వేగంగా ఎగరగల సామర్థ్యాన్ని అందిస్తాయి.

వీటి బరువు 230 నుండి 450 గ్రాముల మధ్య ఉంటుంది. వాటి వెడల్పు 70 నుండి 80 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. బార్-టెయిల్డ్ గాడ్‌విట్ పెద్దపక్షి సుమారుగా 37 నుండి 39 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ జాతి పక్షి సాధారణంగా అలాస్కాలో కనిపిస్తుంది. అయితే వలసల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల వైపు వెళుతుంటాయి.

Updated Date - 2023-01-09T08:59:47+05:30 IST