అది చూడటానికి వాన పాము.. పైగా కళ్లు కూడా కనిపించవు... దాని విష ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో తెలిస్తే...
ABN , First Publish Date - 2023-04-25T11:49:45+05:30 IST
Blind Snake: ప్రతీ పాములోనూ మనిషిని చంపేంత విషం ఉండదు. పాములన్నీ విషపూరితం కాకపోయినా వాటి ఆకృతి మన భయానికి కారణంగా నిలుస్తుంది.
Blind Snake: ప్రతీ పాములోనూ మనిషిని చంపేంత విషం ఉండదు. పాములన్నీ విషపూరితం కాకపోయినా వాటి ఆకృతి మన భయానికి కారణంగా నిలుస్తుంది. కొన్ని పాములు(snakes) చాలా పెద్దవిగా భయం గొలుపుతూ ఉంటాయి. మరికొన్ని చిన్నవిగా ఉన్నా దడ పుట్టిస్తాయి. అయితే ఇప్పుడు వీటికి భిన్నంగా కనిపించే అత్యంత విషపూరితమైన పాము(Most venomous snake) గురించి తెలుసుకుందాం. అది చూడటానికి వానపాములా కనిపిస్తుంది. దాని విషప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో తెలిస్తే, ఎవరైనా హడలెత్తపోవాల్సిందే.
ఆ పామును 'బ్లైండ్ స్నేక్'(blind snake) అని అంటారు. అలాగే ఇండోటైఫ్లోప్స్ బ్రామినస్ అని కూడా అంటారు. ఈ పామును చూసినవారెవరైనా అది వానపాము(earthworm) అని పొరబడతారు. ఎందుకంటే దాని కదలికలు, రంగు అచ్చంగా వానపామును పోలివుంటుంది. అయితే పరిశీలనగా చూస్తే ఈ పాముపై చిన్నపాటి చారలు(Small stripes) కనిపిస్తాయి. దాని తోక కొనదేలి ఉంటుంది. దాని తల దగ్గర రెండు చిన్న చుక్కలు ఉంటాయి. వాటి కళ్లపై ఒక కవర్ ఉంటుంది.
ఈ తరహా ఇండోటైఫ్లోప్స్ బ్రామినియస్ పాములు(Indotyphlops braminius snakes) దాదాపు గుడ్డివి. అవి వేటినీ చూడలేవు. కాంతిని కూడా పసిగట్టలేవు. అయితే ఇవి చాలా ప్రమాదకరమైనవి. ప్రాణాంతకమైన విషాన్ని వెదజల్లుతాయి. ఇవి సాధారణంగా లార్వా, గుడ్లు, చీమలను(Ants) తింటాయి. ఈ పాములు ఎక్కువగా ఆఫ్రికా, ఆసియాలో కనిపిస్తాయి. విశేషమేమిటంటే ఇవి కేవలం ఆడ జాతికి చెందినవై ఉంటాయి. ఇవి ఒంటరిగానే పిల్లలకు జన్మనిస్తాయి. ఇవి ఒకేసారి 8 వరకూ గుడ్లు(Eggs) పెడుతుంటాయి.