Bollywood: బాలీవుడ్ నటి తల్లి మృతి
ABN , First Publish Date - 2023-01-29T16:40:14+05:30 IST
ప్రత్యేక గీతాలతో బాలీవుడ్లో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ రాఖీ సావంత్ (Rakhi Sawant). రియాలిటీ షో బిగ్బాస్ లోను రాఖీ పాల్గొన్నారు. రాఖీ తల్లి జయ (Jaya) నిన్న రాత్రి కన్ను మూశారు.
ప్రత్యేక గీతాలతో బాలీవుడ్లో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ రాఖీ సావంత్ (Rakhi Sawant). రియాలిటీ షో బిగ్బాస్ లోను రాఖీ పాల్గొన్నారు. రాఖీ తల్లి జయ (Jaya) నిన్న రాత్రి కన్ను మూశారు. ఆమె తల్లి కొన్నేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్, క్యాన్స్ర్తో బాధపడుతున్నారు. తాజ్ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా జూన్ 28న తుదిశ్వాస విడిచారు. తన తల్లి మరణ వార్తను రాఖీ సావంత్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపారు. ఈ వార్త తెలియడంతో బాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. పలువురు సెలబ్రిటీలు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
‘‘నన్ను ఆశీర్వదించే మా అమ్మ చేయి ఈ రోజు నుంచి నా తలపై ఉండదు. ఇక నేను కోల్పోవడానికి ఏమీ లేదు. నేను నిన్ను ఎల్లప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు లేకుండా నాకు ఏ పని పూర్తి కాదు. ప్రస్తుతం నేను చెప్పే మాటలను ఎవరు వింటారు. నన్ను ఎవరు కౌగిలించుకుంటారు. ఇప్పుడు నేను ఏం చేయాలి. ఎక్కడికి వెళ్లాలి. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను’’ అని రాఖీ సావంత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.