ఇది తెలియకుండా ప్లాస్టిక్ బాటిల్ కొనొద్దు... పొరపాటున #3, #6, #7 బాటిళ్లు కొన్నారనుకోండి... అంతే సంగతులు!

ABN , First Publish Date - 2023-04-05T10:17:06+05:30 IST

మీరు కొనుగోలు చేసే ప్లాస్టిక్ బాటిల్ కింద ఒక కోడ్ నంబర్ ఉంటుందనే విషయం మీకు తెలుసా? దాని అర్థం ఏమిటో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది తెలియకుండా ప్లాస్టిక్ బాటిల్ కొనొద్దు... పొరపాటున #3, #6, #7 బాటిళ్లు కొన్నారనుకోండి... అంతే సంగతులు!

మీరు కొనుగోలు చేసే ప్లాస్టిక్ బాటిల్(Plastic bottle) కింద ఒక కోడ్ నంబర్ ఉంటుందనే విషయం మీకు తెలుసా? దాని అర్థం ఏమిటో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కొనుగోలు చేసిన ప్లాస్టిక్ బాటిల్‌పై #3 లేదా #7 నంబర్ రాసి ఉంటే బిస్ ఫినాల్ ఎ(Bisphenol a)(బీపీఏ)(పాలిమర్ల తయారీలో ఉపయోగించే సింథటిక్ ఆర్గానిక్ సమ్మేళనం) వంటి హానికరమైన అంశాలు ఈ ప్లాస్టిక్‌లో కలిసిపోయాయని అర్థం.

మీరు కొనుగోలు చేసిన బాటిల్ జాగ్రత్తగా పరిశీలిస్తే, దాని కింది భాగంలో ఒక సంఖ్య కనిపిస్తుంది. బాటిల్ కొనేటప్పుడు ఈ నంబర్ చూసి కొనుగోలు చేయాలి. ప్లాస్టిక్ బాటిల్ వెనుక నంబర్ #1 అని ఉంటే మీరు ఈ బాటిల్‌ను ఒక్కసారి మాత్రమే(Only once) ఉపయోగించవచ్చని అర్థం. మీరు రీయూజబుల్ బాటిల్‌(Reusable bottle)ను కొనుగోలు చేయాలనుకుంటే, బాటిల్ వెనుక నంబర్ #2, #4, #5 ఉందో లేదో చూడాలి.

ఈ నంబర్‌తో ఉన్న ప్లాస్టిక్ బాటిల్‌(Plastic bottle)ను తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఇవి సురక్షితమైనవిగా పరిగణిస్తారు. ప్లాస్టిక్ బాటిల్‌పై నంబర్ #3, #6, #7 అని రాసి ఉంటే మీరు అలాంటి బాటిల్ ఉపయోగించకుండా ఉండటం ఉత్తమం. అవి ఆరోగ్యానికి హానికరం(Harmful to health) అని గమనించండి.

Updated Date - 2023-04-05T10:27:12+05:30 IST