సుందరాంగులపై ప్రభుత్వ నిషేధాస్త్రం... ఇదే అవకాశంగా యువతుల లోదుస్తులు ధరించి హొయలొలికిస్తున్న పురుషులు!

ABN , First Publish Date - 2023-03-06T07:15:23+05:30 IST

మగువల లోదుస్తులు ధరించిన పురుషులను మీరు ఎప్పుడైనా చూశారా? చూసి ఉండకపోవచ్చు. సాధారణంగా ఇలా ఎప్పుడూ జరగదు. అయితే కొన్నిసార్లు ఫాంటసీ చిత్రాలలో అలా చూపిస్తారు.

సుందరాంగులపై ప్రభుత్వ నిషేధాస్త్రం... ఇదే అవకాశంగా యువతుల లోదుస్తులు ధరించి హొయలొలికిస్తున్న పురుషులు!

మగువల లోదుస్తులు ధరించిన పురుషులను మీరు ఎప్పుడైనా చూశారా? చూసి ఉండకపోవచ్చు. సాధారణంగా ఇలా ఎప్పుడూ జరగదు. అయితే కొన్నిసార్లు ఫాంటసీ చిత్రాలలో అలా చూపిస్తారు. కొన్ని సీన్లలో పురుషులు బ్రా-ప్యాంటీలు ధరించి కనిపిస్తారు. చైనాలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇటీవల చైనీస్ ప్రభుత్వం మహిళా మోడల్‌ళ్లను బ్రా-ప్యాంటీలలో చిత్రీకరించకూడదంటూ నిషేధించింది.

దీంతో ఇకపై వారు ఏ ప్రకటనలోనూ బ్రా-ప్యాంటీలతో కనిపించరు. చైనాలో అసభ్యకర అంశాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇలాంటి పరిస్థితిలో మహిళల అండర్ గార్మెంట్స్ విక్రయించే కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నాయి. లోదుస్తుల ప్రకటనలలో మహిళా మోడల్స్ కనిపించకపోతే తమ ఉత్పత్తులు ఎలా అమ్ముడవుతాయని పలు కంపెనీల వారు ప్రశ్నిస్తున్నారు.

అలాగే తమ ఉత్పత్తుల ప్రకటనలలో మహిళలకు బదులు బ్రా-ప్యాంటీల్లో పురుషులను చూపిస్తున్నాయి. చైనాలోని పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మహిళల లోదుస్తులను ధరించిన పురుష మోడళ్లు కనిపిస్తున్నారు. కాగా లైవ్ స్ట్రీమ్ షాపింగ్ షోలు చైనాలో విరివిగా జరుగుతుంటాయి. లైవ్ స్ట్రీమ్ టర్నోవర్ ఈ సంవత్సరం చివరి నాటికి $700 బిలియన్లకు మించి ఉంటుందని అంచనా. డౌయిన్ అనే చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో మగ మోడల్స్ వివిధ రకాల మహిళల స్టైలిష్ లోదుస్తులను ధరించడం కనిపిస్తుంది.

వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన కొందరు నెటిజన్స్ లోదుస్తులలో పురుష మోడల్స్ యువతుల కన్నా అందంగా కనిపిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2023-03-06T07:15:23+05:30 IST