Viral Video: లోపలికి వచ్చేదే లేదని తేల్చి చెప్పిన వధువు.. ఆమె ఎందుకలా చెప్పిందో తెలిస్తే మాత్రం నవ్వుకోకుండా ఉండలేరు..

ABN , First Publish Date - 2023-03-12T16:38:31+05:30 IST

జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వివాహం ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతిలా మిగిలిపోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా ఈ డిజిటల్ మీడియా యుగంలో ప్రతి క్షణాన్ని కెమేరాలోనూ, వీడియోలను బంధించాలని తపించిపోతుంటారు.

Viral Video: లోపలికి వచ్చేదే లేదని తేల్చి చెప్పిన వధువు.. ఆమె ఎందుకలా చెప్పిందో తెలిస్తే మాత్రం నవ్వుకోకుండా ఉండలేరు..

జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వివాహం ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతిలా మిగిలిపోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా ఈ డిజిటల్ మీడియా యుగంలో ప్రతి క్షణాన్ని కెమేరాలోనూ, వీడియోలను బంధించాలని తపించిపోతుంటారు. అందుకోసం అన్ని ఏర్పాట్లూ పక్కాగా చేసుకుంటారు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ వధువు ప్రవర్తన చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).

the_wedding_dance_india అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన వీడియోలో.. ఎరుపు రంగు లెహంగా ధరించిన వధువు (Bride Videos) కల్యాణ మండపంలోకి ప్రవేశిస్తోంది. అయితే ఆ సమయంలో డీజే సాంగ్ ఆమెకు అసహనాన్ని కలిగించింది. తను కోరినంత సేపు పాటు రావాలని అరుస్తూ చెప్పింది. ఆ పాట ప్లే కాకపోవడంతో నేను లోపలికి రానని చెప్పింది. కల్యాణ మండపంలోకి తను ఎంట్రీ ఇస్తున్నప్పుడు వచ్చే సాంగ్ కోసం ఆమె అంతలా పట్టుబట్టడం చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియో (Wedding Videos) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

``మీ నాన్న నా అప్పు తీర్చనవసరం లేదు.. నేను చెప్పినట్టు చెయ్యి``.. ఒంటరిగా ఉన్న బాలిక దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి చేసిన పనికి..

Updated Date - 2023-03-12T16:38:31+05:30 IST