Bride: పెళ్లయిన వారం రోజులకే కొత్త పెళ్లి కొడుక్కు బిగ్ షాక్.. ఎన్నో ఆశలతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటే..!

ABN , First Publish Date - 2023-07-11T15:23:28+05:30 IST

తన భార్యను ప్రాణం పోయే వరకు విడువనని ప్రమాణం చేశాడు. అంగరంగ వైభవంగా పెళ్ళిచేసుకుని తన భార్యను అత్తింటికి కూడా తీసుకొచ్చాడు. కానీ..

Bride: పెళ్లయిన వారం రోజులకే కొత్త పెళ్లి కొడుక్కు బిగ్ షాక్.. ఎన్నో ఆశలతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటే..!

మూడుముళ్ళు, ఏడడుగులతో జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని ప్రమాణం చేసుకుని పెళ్లి బంధం ద్వారా భార్యాభర్తలవుతారు. అతను కూడా తన పెళ్ళిలో తన భార్యను ప్రాణం పోయే వరకు విడువనని ప్రమాణం చేశాడు. అంగరంగ వైభవంగా పెళ్ళిచేసుకుని తన భార్యను అత్తింటికి కూడా తీసుకొచ్చాడు. కానీ వారం రోజుల తరువాత ఆ కొత్త పెళ్ళి కొడుక్కి ఊహించని షాక్ తగిలింది. నిజమేంటో తెలిసి అతని గుండె ఆగినంత పనైంది. అతనికి, అతని కుంటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ సంఘటన గురించి విన్నవారు కూడా చాలా షాకవుతున్నారు. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

భారతీయ పెళ్ళిళ్ళు(Indian Marriages) రెండు కుటుంబాల నిర్ణయంతో జరుగుతాయి. చాలా వరకు అరేంజ్డ్ మ్యారేజ్(arranged marriage) లు బంధువులు, తెలిసినవారు చెప్పే సంబంధాల వల్లా, ఆన్లైన్ మాట్రమొనిల వల్లా, సంబంధాలు కుదిర్చే బ్రోకర్ల వల్లా జరుగుతుంటాయి. రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం జైపూర్(jaipur) లో విశ్వకర్మ నగర్ లో రాంలాల్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. రాంలాల్ కు సంబందాలు చూసే ఒక ఏజెంట్ పశ్చిమ బెంగాల్(West Bengal) కు చెందిన సుస్మిత సంబంధం తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి అందంగా ఉండటంతో రాంలాల్ తో పాటు అతని కుటుంబం కూడా ఒప్పేసుకుంది. ఆ సంబంధం కుదిర్చినందుకుగానూ రాంలాల్ కుటుంబం నుండి ఆ ఏజెంట్ 3.5లక్షల రూపాయలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో రాంలాల్, సుస్మితల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తరువాత రాంలాల్ సుస్మితను తమ ఇంటికి తీసుకెళ్ళాడు. సుస్మిత అత్తారింట్లో అందరితో చాలా బాగా కలిసిపోయింది. అంత అందమైన అమ్మాయి, అందులోనూ గుణవంతురాలు తమ ఇంటికి కోడలుగా రావడం తమ అదృష్టమని వారు పొంగిపోయారు.

Lady Finger: రెండ్రోజులకే బెండకాయలు వడబడిపోతున్నాయా..? ఇలా చేయండి చాలు.. ఏడాదైనా నిగనిగలాడటం ఖాయం..!


వారం రోజులు సంతోషంతో గడిచిపోయాయి. ఓ రోజు ఉదయాన్నేలేచిన రాంలాల్ కు పక్కన భార్య కనిపంచలేదు. ఇంట్లో పనులు చేస్తోందేమోనని ఆమెను వెతుక్కుంటూ గదిలో నుండి బయటకు వచ్చాడు. ఇంట్లో ఎక్కడా ఆమె కనిపించలేదు. కుటుంబ సభ్యులందరూ ఇల్లంతా గాలించారు, ఇంటి బయట, వారు నివసిస్తున్న వీధి మొత్తం గాలించారు. కానీ సుస్మిత కనిపించలేదు. ఈ క్రమంలో ఇంట్లో 18లక్షరూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో వారి గుండె ఆగినంతపనైంది. అమ్మాయి తమను మోసం చేసిందనే(women cheating with marriage) విషయం వారికి అర్థమైపోయింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దొంగ పెళ్ళికూతురిని పట్టుకునే పనిలో ఉన్నారు. కాగా రాజస్థాన్ లో ఏటా ఇలాంటి సంఘటనలు 90కి పైగా నమోదు అవుతున్నాయట. ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉండటంతో మగపిల్లలు పెళ్ళి పేరుతో మోసపోతున్నారు.

Donkey vs Old Man: పాపం.. ఈ పెద్దాయన.. తన మానాన తాను రోడ్డుపై వెళ్తోంటే.. ఈ గాడిద ఏం చేసిందో మీరే చూడండి..!


Updated Date - 2023-07-11T15:23:28+05:30 IST