ఈ పెళ్లిని ఆపండి.. గట్టిగా అరిచాడో బంధువు.. ఏంటని అంతా నిలదీస్తే వరుడి గురించి అతడు చెప్పిన నిజం విని అంతా షాక్..!

ABN , First Publish Date - 2023-02-27T16:29:29+05:30 IST

ఇదేదో సినిమా సీన్ లా అనిపిస్తుందేమో కానీ

ఈ పెళ్లిని ఆపండి.. గట్టిగా అరిచాడో బంధువు.. ఏంటని అంతా నిలదీస్తే వరుడి గురించి అతడు చెప్పిన నిజం విని అంతా షాక్..!

పెళ్ళి ఏర్పాట్లు అన్ని అయ్యాయి. బంధులు అందరూ వచ్చారు. పెళ్ళి తంతు జరుగుతుండగా ఓ బంధువు ఉన్నట్టుండి ఈ పెళ్ళి ఆపండి అంటూ అరిచాడు. ఇదేదో సినిమా సీన్ లా అనిపిస్తుందేమో కానీ ఇది ఓ పెళ్ళి వేడుకలో నిజంగా జరిగింది. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుంటే

మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ లో ఓ అమ్మాయికి ఫేస్ బుక్ లో సత్యం సోని అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ కలసి పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అమ్మాయి తరపున ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో వారి పెళ్ళి తేదీ నిర్ణయమయింది. దాని ప్రకారం ఆదివారం రాత్రి పెళ్ళి వేడుక మొదలయింది. దానికి బంధువులు, స్నేహితులు అందరూ హాజరయ్యారు. పెళ్ళిలో అంతా సందడిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి కళ్ళు పెళ్ళికొడుకు మీద పడ్డాయి. అతను వెంటనే పెళ్లిని ఆపమని చెప్పాడు. ఎందుకు ఏమైందని అందరూ ప్రశ్నించారు. 'పెళ్ళికొడుకు అమ్మాయిని మోసం చేస్తున్నట్టున్నాడు, అతనికి ఇదివరకే పెళ్ళయ్యింది, ఒక కూతురు కూడా ఉంది' అని పెళ్ళికొడుకు గుట్టు బయటపెట్టాడు. దీంతో బంధువులు, అక్కడున్నవారు అందరూ కలసి పెళ్ళికొడుకును చితకబాదారు. పెళ్ళి వేదిక మీద నుండి ఈడ్చి పడేశారు.

Read also: సొంతంగా గ్రామాభివృద్ది పనులు చేస్తున్న ఇతడికోసం 6రాష్ట్రాల పోలీసుల వేట మామూలుగా లేదు.. కారణమేంటంటే..


అబ్బాయి సత్యం సోనికి పెళ్ళయి కూతురు ఉన్నా అసలు పెళ్ళి కాలేదని తాను బ్రహ్మచారినని చెప్పి అమ్మాయిని మాయచేసాడని తెలిసింది. వారిది ఫేస్ బుక్ పరిచయం కావడంతో అతను చాలా సులువుగా ఆమెను నమ్మించాడు. పెళ్ళివేడుకలో గొడవ జరుగుతోందనే విషయం తెలియగానే ఆదివారం రాత్రి లార్డ్ గంజ్ పోలీసులు అగమేఘాలమీద అక్కడికి చేరుకుని అమ్మాయి బంధువుల నుండి అతన్ని కాపాడారు. అనంతరం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు.

Updated Date - 2023-02-27T16:43:26+05:30 IST