Viral Video: పాపం.. పెళ్లి పీటల మీదే మత్తులో వధువు.. వరుడు చేసిన పనితో ముసి ముసి నవ్వులు..
ABN , First Publish Date - 2023-03-13T17:19:37+05:30 IST
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఆయా పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల (Marriages) సీజన్ నడుస్తోంది. ఆయా పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి పీటల మీద కూర్చున్న వధువు అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఆ వీడియో చూసిన చాలా మంది తమ పెళ్లి నాటి సంగతులను పంచుకుంటున్నారు (Wedding Videos).
ఆ వైరల్ వీడియోలో ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. ఓ వైపు పెళ్లి వేడుక జరుగుతుండగా, పీటల మీద కూర్చున్న వధువు నిద్రలోకి జారుకుంది (Bride slept in between the wedding ceremony). ఇంతలో వరుడు ఆమెను తట్టి లేపాడు. వెంటనే కళ్లు తెరిచిన వధువు అందరినీ చూసి చిరునవ్వులు చిందించింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో ఒక యూజర్ షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది (Viral Video). ఆ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు తమ పెళ్లి నాటి సంగతులను నెమరు వేసుకుంటున్నారు. తెల్లవారు ఝామున జరిగే పెళ్లిళ్లలో ఇలాంటివి తప్పవని ఒకరు కామెంట్ చేశారు. తాను కూడా పెళ్లి జరుగుతుండగా అలాగే నిద్రపోయానని ఓ మహిళ తెలిపారు.