Bride: పెళ్లయిన మర్నాడే భర్తను ఫోన్ అడిగిన భార్య.. దూరంగా వెళ్లి కంగారుగా మాట్లాడుతోంటే.. అనుమానంతో ఆ భర్త వెళ్లి చాటుగా వింటే..

ABN , First Publish Date - 2023-05-03T14:29:13+05:30 IST

'ఒక్కసారి ఫోన్ ఇస్తారా!' అని భర్తను అడిగి ఫోన్ ఇప్పించుకుని ఫోన్ కాల్ చేసి మాట్లాడింది.. కానీ ఆ తరువాత ఎవరూ ఊహించని విధంగా..

Bride: పెళ్లయిన మర్నాడే భర్తను ఫోన్ అడిగిన భార్య.. దూరంగా వెళ్లి కంగారుగా మాట్లాడుతోంటే.. అనుమానంతో ఆ భర్త వెళ్లి చాటుగా వింటే..

తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో ఆ అమ్మాయి పెళ్లి ఎంతో గొప్పగా జరిగింది. తల్లిదండ్రులు ఆ అమ్మాయిని పుట్టింటి లాంఛనాలతో అత్తింటికి పంపారు. అత్తారింట్లోనూ ఆ అమ్మాయికి గొప్ప ఆహ్వానమే లభించింది. అయితే పెళ్ళయిన మర్నాడే అమ్మాయి తన భర్త దగ్గరకు వెళ్ళి 'ఒక్కసారి ఫోన్ ఇస్తారా?' అని అడిగింది. భర్త ఫోన్ ఇవ్వగానే కంగారుగానే దూరంగా వెళ్లింది. ఆమె కంగారు గమనించిన భర్తకు ఆమె మీద ఎందుకో అనుమానం వచ్చింది. చాటుగా వెళ్లి ఆమె ఎవరితో మాట్లాడుతోందా అని విన్నాడు. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాలు విస్తుపోయేలా ఉన్నాయి. ఈ కొత్తపెళ్ళికూతురి గురించి విన్న ప్రతి ఒక్కరూ షాకవుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం బరేలీ(Bareli)లో ఎవరూ ఊహించని ఓ సంఘటన చోటు చేసుకుంది. బరేలీ ప్రాంతంలో నివసిస్తున్న మున్నీ అనే అమ్మాయికి అదే గ్రామానికి చెందిన దేవేంద్ర అబ్బాయితో ఆమె తల్లిదండ్రులు పెళ్లి జరిపించారు. పెళ్లి తరువాత అమ్మాయిని పుట్టింటి లాంఛనాలతో అత్తారింటికి పంపించారు. అత్తింటివారు కూడా మున్నీకి ఎంతో గొప్పగా స్వాగతం పలికారు. అయితే పెళ్ళయిన మరుసటి రోజు మున్నీ తన భర్త దేవేంద్ర దగ్గరకు వెళ్లి మొబైల్ ఫోన్(Mobile Phone) అడిగింది. అతను కూడా ఎందుకు అని అడగకుండా ఆమెకు ఫోన్ ఇచ్చాడు. భర్త నుండి ఫోన్ తీసుకున్న మున్నీ కంగారుపడుతూనే దూరంగా వెళ్లింది. ఆమె కంగారు చూసిన దేవేంద్రకు ఆమె మీద అనుమానం వచ్చింది. అతను ఆమెకు కనిపించకుండా చాటుగా ఆమె మాట్లాడింది మొత్తం విన్నాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్టు అక్కడినుండి వెళ్ళిపోయాడు. మున్నీ దేవేంద్రకు ఫోన్ తిరిగివ్వగానే అతను మున్నీ తండ్రికి ఫోన్ చేసి తను విన్నదంతా చెప్పాడు. మున్నీ తండ్రి తన కొడుకు, తన పెద్దల్లుడితో కలసి దేవేంద్ర ఇంటికి చేరుకున్నాడు. ఉన్నపళంగా మున్నీని అక్కడినుండి బయటకు తీసుకెళ్లారు.

Viral Video: కారు డిక్కీ డోర్‌ను తీసేసి.. ఇనుప చువ్వలు అడ్డుగా పెట్టి.. ఓ డ్రైవర్ చేసిన నిర్వాకమిదీ..!


దారి మధ్యలో వారు ప్రయాణిస్తున్న వాహనం ఆపారు. మున్నీని వాహనంలో నుండి దింపి ఒక్కసారిగా మున్నీమీద దాడి చేశారు. వారు ముగ్గురూ ఆమెను చాలా దారుణంగా కొట్టారు. ఆ తరువాత మున్నీ ముఖంమీద టాయిలెట్ క్లీన్ చేసే యాసిడ్ పోశారు. దీంతో ఆమె చనిపోయి ఉంటుందని అనుకున్నారు. ఆమెను రోడ్డు పక్కన పొదల్లో పడేసి అక్కడినుండి పారిపోయారు. అయితే రోడ్డు పక్కన పొదల్లో యువతి కొనప్రాణంతో ఉన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్లో ఆరురోజుల నుండి చికిత్స పొందతూ మున్నీ మృతి చెందింది. కాగా మున్నీ బరేలీ గ్రామానికి చెందిన ఓ కుర్రాడిని ప్రేమించింది. వాళ్ళిద్దరూ చాలాకాలం నుండి రిలేషన్షిప్ లో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ తల్లిదండ్రులకు ఆమె ప్రేమ వ్యవహారం నచ్చలేదు. దీంతో ఆమెకు ఇష్టంలేకపోయినా బలవంతంగా దేవేంద్రతో వివాహం జరిపించారు. మున్నీ దేవేంద్రతో ఫోన్ ఇప్పించుకుని తన ప్రియుడితో మాట్లాడటం దేవేంద్ర విన్నాడు. అదే విషయాన్ని మున్నీ తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. తన కూతురు పెళ్లి అయినా మరొకడితో మాట్లాడుతోందని తెలిసి మున్నీ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు నిందితులను ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Viral Photo: ఖరీదైన బహుమతులూ ఇవ్వలేదు.. నోరు తెరిచి చెప్పలేదు.. ఈ కుర్రాడి ప్రపోజల్ కు అమ్మాయి ఫిదా .. ఇంతకూ అతనేం చేశాడంటే..


Updated Date - 2023-05-03T14:29:13+05:30 IST