Crime: కూలి పనికి వెళ్లి అదృశ్యమైన కూతురి కోసం తల్లి పోరాటం.. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఏకంగా హోం మినిస్టర్‌కు ఫిర్యాదు చేస్తే..
ABN , First Publish Date - 2023-11-11T15:05:41+05:30 IST
ఆ బాలిక వయసు 15 ఏళ్లు.. పేద కుటుంబానికి చెందిన ఆ బాలిక చిన్న వయసు నుంచే కూలి పనికి వెళ్తూ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తోంది.. భవన నిర్మాణ కార్మికురాలిగా పని చేస్తోంది.. ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన మధ్యాహ్న భోజన సమయంలో ఆ బాలికను కాంట్రాక్టర్ పిలిచాడు.
ఆ బాలిక వయసు 15 ఏళ్లు (15 Years old girl).. పేద కుటుంబానికి చెందిన ఆ బాలిక చిన్న వయసు నుంచే కూలి పనికి వెళ్తూ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తోంది.. భవన నిర్మాణ కార్మికురాలిగా పని చేస్తోంది.. ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన మధ్యాహ్న భోజన సమయంలో ఆ బాలికను కాంట్రాక్టర్ పిలిచాడు.. కాంట్రాక్టర్‌తో పాటు ఆమె మూడో ఫ్లోర్‌కు వెళ్లింది.. ఆ తర్వాతి నుంచి ఆ బాలిక ఎవరికీ కనిపించలేదు.. తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు.. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు (Crime News).
హర్యానా (Haryana)లోని పానిపట్ జిల్లా హర్దోయ్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన తమ 15 ఏళ్ల కూతురు కనిపించడం లేదని సెప్టెంబర్ నెలలో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు కూడా నమోదు చేసుకోలేదు. దీంతో ఆమె జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఎస్పీ ఆదేశం మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయినా విచారణ మాత్రం చేయలేదు. ఎన్ని రోజులైన తమ కూతురి జాడ తెలియకపోవడంతో ఆ మహిళ ఏకంగా రాష్ట్ర హోం మంత్రిని ఆశ్రయించింది. హోం మంత్రి ఆదేశాలతో పోలీసులు సీరియస్‌గా విచారణ జరిపించారు.
Viral Story: 49 ఏళ్ల క్రితం వోల్వో కార్ల కోసం అప్పు.. ఇప్పుడు స్వీడన్‌కు ఉత్తరకొరియా చెల్లించాల్సింది ఎంతంటే..
బాధిత బాలిక తల్లిదండ్రులు కాంట్రాక్టర్ మీద అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. సెప్టెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డానని, ఆమె ఎదురు తిరగడంతో ఇటుక రాయితో కొట్టి చంపేశానని చెప్పాడు. మృతదేహాన్ని గోనెలో వేసి దాచానని చెప్పాడు. పోలీసులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.