Viral Video: వామ్మో.. ఈ గేదెకు ఎంత బలమో చూడండి.. ఏకంగా సింహాన్ని ఎత్తి పడేసింది.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

ABN , First Publish Date - 2023-06-06T16:01:21+05:30 IST

సోషల్ మీడియాలో ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిల్లో జంతువులకు సంబంధించినవి కూడా ఉంటున్నాయి. జంతువుల మధ్ ఫైటింగ్, పులుల, సింహాల వేటలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Viral Video: వామ్మో.. ఈ గేదెకు ఎంత బలమో చూడండి.. ఏకంగా సింహాన్ని ఎత్తి పడేసింది.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

సోషల్ మీడియాలో ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిల్లో జంతువులకు (Animal Videos) సంబంధించినవి కూడా ఉంటున్నాయి. జంతువుల మధ్య ఫైటింగ్, పులుల, సింహాల వేటలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో (Viral Video) ఓ సింహానికి (Lion) అడవి గేదె (Buffalo) చుక్కలు చూపించింది. సింహాన్ని పైకి ఎత్తి పలు సార్లు కింద పడేసింది. ఆ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

@Figensport అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఒక గేదె పక్కన సింహం నక్కి నక్కి కూర్చుంది. ఆ సింహాన్ని చూసిన మరో గేదె కొంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి సింహంపై దాడికి దిగింది (Buffalo attacks lion). సింహాన్ని తన కొమ్ముతో ఎత్తి గాలిలోకి విసిరేసింది. దాంతో ఆ సింహం ఎత్తు నుంచి కింద పడింది. అయినా ఆ గేదె ఊరుకోలేదు. మరోసారి ఆ సింహాన్ని పైకి ఎత్తి బలంగా నేలకేసి కొట్టింది. ఈ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

Odisha Train Accident: చనిపోయాడని 24 ఏళ్ల కుర్రాడిని మార్చురీలో పడేస్తే.. వెతుక్కుంటూ వచ్చిన తండ్రి బతికించుకున్నాడు..!

ఈ వీడియోను ఇప్పటివరకు 24 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అది చాలా శక్తివంతమైన నీటి గేదె అని ఒకరు కామెంట్ చేశారు. ``నమ్మకమైన వ్యక్తులతో కలిసి ఉంటే, కష్ట సమయాల్లో వారు ఖచ్చితంగా మీకు మద్దతు ఇస్తారని ఈ వీడియో రుజువు చేస్తోంద``ని మరొకరు పేర్కొన్నారు.

Updated Date - 2023-06-06T16:01:21+05:30 IST