Viral Video: ఈ గేదెలు సరదాగా చేసిన పనికి రూ.25 లక్షలు మటాష్.. ఒకదాని తర్వాత మరొకటి ఏకంగా 18 గేదెలు ఏం చేశాయో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-05-24T14:14:12+05:30 IST

పాపం ఆ వ్యక్తి తన ఇంటి ఆవరణలో కొత్తగా స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నాడు.. దాదాపు 71 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునిక సౌకర్యాలతో దాన్ని నిర్మించుకున్నాడు.. ఆ పూల్‌లో ఫ్లవర్ బెడ్స్, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాడు.

Viral Video: ఈ గేదెలు సరదాగా చేసిన పనికి రూ.25 లక్షలు మటాష్.. ఒకదాని తర్వాత మరొకటి ఏకంగా 18 గేదెలు ఏం చేశాయో మీరే చూడండి..!

పాపం ఆ వ్యక్తి తన ఇంటి ఆవరణలో కొత్తగా స్విమ్మింగ్ పూల్ (Swimming Pool) కట్టించుకున్నాడు.. దాదాపు 71 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునిక సౌకర్యాలతో దాన్ని నిర్మించుకున్నాడు.. ఆ పూల్‌లో ఫ్లవర్ బెడ్స్, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆ ఇంటికి సమీపంలో ఉన్న పొలం నుంచి వచ్చిన ఎనిమిది గేదెలు (Buffaloes) మొత్తం పాడు చేశాయి. స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకి ఏకంగా రూ.25 లక్షల వరకు నష్టం కలిగించాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Buffaloes jumped into swimming pool).

బ్రిటన్‌లోని (Britain) ఎసెక్స్‌లో ఉంటున్న ఆండీ, లినెట్ దంపతులు తమ రిటైర్మెంట్ ఫండ్స్‌తో ఓ మంచి స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఆ పూల్ కోసం ఏకంగా రూ.71 లక్షలు ఖర్చు పెట్టారు. ఒకరోజు ఉదయాన్నే టీ పెట్టడానికి లినెట్ వంట గదిలోకి వెళ్లింది. ఆమె కిటికీలో నుంచి స్విమ్మింగ్ పూల్‌‌ను చూసి షాకైంది. అక్కడ 8 గేదెలు పూల్‌లోకి దూకి ఆడుకుంటున్నాయి. వెంటనే ఆమె గట్టిగా కేకలు వేసింది.

Viral News: మీ మైక్‌ను ఆఫ్‌ చేస్తారా..? సౌండ్స్ భరించలేకపోతున్నాం.. మీటింగ్ మధ్యలో ఓ మహిళకు మేనేజర్ మెసేజ్..!

వెంటనే 999కి కాల్ చేసి చెప్పడంతో సిబ్బంది వచ్చారు. వారు ఆ గేదెలను సురక్షితంగా బయటకు తీశారు. ఆ గెదేలు పూల్‌ను మొత్తం పాడు చేసెయ్యడం వల్ల సుమారు రూ.25 పాతిక లక్షల వరకు నష్టం వాటిల్లింది. అయితే ఆ పూల్‌కు ఆండీ ఇన్సూరెన్స్ చేయించాడు. దాంతో ఆ నష్టాన్ని ఇన్సూరెన్స్ సంస్థ భరించింది.

Updated Date - 2023-05-24T14:14:12+05:30 IST