విమానం నుంచి వారే ముందుగా దిగుతారు... లగ్జరీ ఫుడ్, వెయిటింగ్ రూమ్ కూడా... ఈ వైభోగాలన్నీ ఎవరికోసమంటే...
ABN , First Publish Date - 2023-03-29T12:31:00+05:30 IST
విమాన ప్రయాణికులలో చాలామంది బిజినెస్ క్లాస్(Business class)లో ప్రయాణించాలని అనుకుంటుంటారు. ఇంతకీ బిజినెస్ క్లాసులో ఎటువంటి ప్రయోజనాలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
విమాన ప్రయాణికులలో చాలామంది బిజినెస్ క్లాస్(Business class)లో ప్రయాణించాలని అనుకుంటుంటారు. ఇంతకీ బిజినెస్ క్లాసులో ఎటువంటి ప్రయోజనాలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చూస్తే ఎకానమీ క్లాసు(Economy class)కు బిజినెస్ క్లాసుకు పెద్ద వ్యత్యాసం సీటు పరిమాణం. బిజినెస్ క్లాస్ సీట్లు చాలా భిన్నంగా ఉంటాయి. ఎకానమీ క్లాస్‌లోని సీటు బస్సులోని సీటు మాదిరిగా ఉంటుందని భావించవచ్చు.
దానిలో తక్కువ స్థలం ఉంటుంది. బిజినెస్ క్లాస్ సీటు చాలా పెద్దగా ఉంటుంది. అది సోఫాలో కూర్చున్న అనుభూతి(feeling)నిస్తుంది. దీనితో పాటు ఈ సీట్లలో లెగ్ స్పేస్ కూడా ఉంటుంది. ఫలితంగా ప్రయాణం(travel) ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. బిజినెస్ క్లాస్ సీటులో ప్రత్యేక స్థలం ఉంటుంది. అదనపు బ్యాగేజ్ అలవెన్స్ ఇందులో అందుబాటులో ఉంటుంది.
బిజినెస్ క్లాస్ ప్రయాణికుల కోసం ప్రత్యేక వెయిటింగ్ రూమ్(Waiting room) ఉంటుంది. బోర్డింగ్ సమయంలో వారికి ప్రాధాన్యత ఇస్తారు. లగ్జరీ ఫుడ్ కూడా వారికి అందిస్తారు. బిజినెస్ క్లాస్‌లో వెళ్లే ప్రయాణికులకు(passengers) ప్రత్యేక సేవలు అందజేస్తారు. విమానం ల్యాండ్ అయినప్పుడు వారు కిందికి దిగేందుకు తొలి అవకాశం ఇస్తారు. బిజినెస్ క్లాస్‌లో ఇంటీరియర్(Interior) మొదలైనవి భిన్నంగా ఉంటాయి. ఇన్ని కారణాలున్నరీత్యా విమాన ప్రయాణికులు బిజినెస్ క్లాస్ అంటే అమితంగా ఇష్టపడుతుంటారు.