Share News

Shocking: ఓ నిండు గర్భిణికి సిజేరియన్ ఆపరేషన్.. బయటకు వచ్చిన శిశువును చూసి అవాక్కైన డాక్టర్లు.. వైద్య చరిత్రలోనే..!

ABN , First Publish Date - 2023-11-10T12:07:53+05:30 IST

ఓ నిండు గర్భిణి సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆమెకు సిజేరియన్ చేసిన డాక్టర్లు.. బయటకు వచ్చిన శిశువును చూసి అవాక్కైనారు.

Shocking: ఓ నిండు గర్భిణికి సిజేరియన్ ఆపరేషన్.. బయటకు వచ్చిన శిశువును చూసి అవాక్కైన డాక్టర్లు.. వైద్య చరిత్రలోనే..!

Shocking: ఓ నిండు గర్భిణి సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆమెకు సిజేరియన్ చేసిన డాక్టర్లు.. బయటకు వచ్చిన శిశువును చూసి అవాక్కైనారు. భారీ కాయంతో పుట్టిన ఆ బిడ్డ ఏకంగా 6.57కిలోలు ఉండడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. బ్రిట్నీ ఐరెస్ అనే కెనడియన్ మహిళ అక్టోబర్ 23న అంటారియోలోని కేంబ్రిడ్జ్ మెమోరియల్ ఆస్పత్రి (Cambridge Memorial Hospital in Ontario) లో ఇలా బాల భీముడికి జన్మనిచ్చింది. 14 పౌండ్ల 8 ఔన్సుల (సుమారు 6.57కిలోలు) బరువుతో ఉన్న ఆ మగ శిశువు పుట్టిన సమయంలో దాదాపు 21.65 అంగుళాల పొడవు ఉండటం మరో విశేషం. ఇక బ్రిట్నీ, ఛాన్స్‌ దంపతులు తమకు పుట్టిన ఆ బిడ్డకు సోన్నీ (Sonny) అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌లోని ప్రసూతి వైద్యుడు, స్త్రీ జననేంద్రియ నిపుణుడు డాక్టర్ ఆసా అహింబిసిబ్వే మాట్లాడుతూ.. 2010 నుండి తమ ఆసుపత్రిలో జన్మించిన అతిపెద్ద శిశువు సోన్నీ అని అన్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, బ్రిట్నీ ఇప్పటికే మరో నలుగురు పిల్లలు ఛాన్స్ జూనియర్, ఎవెరెట్, లక్కీ, మేరిగోల్డ్‌లకు తల్లి. వారిలో మేరిగోల్డ్, లక్కీ కూడా పుట్టినప్పుడు 13 పౌండ్ల కంటే ఎక్కువ బరువు కలిగి ఉన్నారట.

Muskan Agrawal: ఎవరీ ముస్కాన్ అగర్వాల్..? ఏకంగా రూ.60 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆమెకు ఎలా వచ్చిందంటే..!


Baby-Boy.jpg

"ఈ శిశువు కూడా భారీ కాయంతోనే పుడుతుందని మాకు తెలుసు. కానీ, పుట్టిన బిడ్డ ఇంత భారీగా ఉంటాడని మాత్రం మేము ఊహించలేదు" అని డా. అహింబిసిబ్వే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇక తమకు పుట్టిన శిశువు భారీ పరిమాణంపై వైద్యులు, నర్సులు ఎలా స్పందించారో సోన్నీ తండ్రి ఛాన్స్‌ మీడియాతో పంచుకున్నారు. "డాక్టర్లు, నర్సులు కూడా శిశువు ఎంత భారీకాయంతో పుట్టబోతున్నాడని అప్పటికే అందరూ బెట్టింగ్‌లు వేస్తున్నారు. పుట్టిన వెంటనే వారు అతనిని స్కేల్‌పై ఉంచారు" అని అన్నారు. ఇదిలాఉంటే.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (Guinness Book of World Records) 1879లో 22 పౌండ్ల బరువుతో జన్మించిన ఆడ శిశువు ఉంది. అయితే, ఆ పాప పుట్టిన 11 గంటలకే చనిపోయింది.

Pakistan: పాకిస్తాన్ పౌరులకు మరో కొత్త కష్టం.. ఉన్నట్టుండి పాస్‌పోర్టుల జారీనీ ఆ దేశం ఎందుకు బంద్ చేసిందంటే..!

Updated Date - 2023-11-10T12:10:15+05:30 IST