Share News

Viral: ఒకప్పుడు క్రికెట్ టీమ్ కెప్టెన్.. రూ.2000 కోట్ల సినిమాలోనూ నటించిన ఈ వ్యక్తి ఎవరో గుర్తు పట్టగలరా..?

ABN , First Publish Date - 2023-11-20T17:40:39+05:30 IST

పై ఫొటోలోని వ్యక్తిని గుర్తు పట్టగలరా? అతడు గతంలో హర్యానా అండర్-19 టీమ్ కెప్టెన్. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించి ``దంగల్`` సినిమాలో నటించాడు. అతడు నటుడు, క్రికెటర్ మాత్రమే కాదు.. ఆర్‌జే, స్టాండప్ కమెడియన్, గాయకుడు, టీవీ హోస్ట్.. ఇలా పలు రంగాల్లో చక్కని ప్రతిభ కనబరిచాడు.

Viral: ఒకప్పుడు క్రికెట్ టీమ్ కెప్టెన్.. రూ.2000 కోట్ల సినిమాలోనూ నటించిన ఈ వ్యక్తి ఎవరో గుర్తు పట్టగలరా..?

పై ఫొటోలోని వ్యక్తిని గుర్తు పట్టగలరా? అతడు గతంలో హర్యానా అండర్-19 టీమ్ కెప్టెన్. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించి ``దంగల్`` సినిమాలో నటించాడు. అతడు నటుడు, క్రికెటర్ మాత్రమే కాదు.. ఆర్‌జే, స్టాండప్ కమెడియన్, గాయకుడు, టీవీ హోస్ట్.. ఇలా పలు రంగాల్లో చక్కని ప్రతిభ కనబరిచాడు. అయితే అతడి ప్రతిభకు తగిన గుర్తింపు మాత్రం దొరకడం లేదు.. ఆ వ్యక్తి పేరు అపరశక్తి ఖురానా (Aparshakti Khurana). బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) సోదరుడు.

యుక్త వయసులో ఉన్నప్పుడు ఆపరశక్తి క్రికెట్ అద్భుతంగా ఆడేవాడు. హర్యానా (Haryana) టీమ్ అండర్-19 కెప్టెన్‌గా కూడా పని చేశాడు. అయితే అతడి సోదరుడు ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్‌ (Bollywood)లోకి ప్రవేశించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఆపరశక్తి మనసు కూడా సినిమాల వైపు మళ్లింది. అపరశక్తి మొదటి సినిమా ఆమిర్ ఖాన్ నటించిన ``దంగల్`` (Dangal). రూ.2 వేల కోట్లు వసూలు చేసిన ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ మేనల్లుడుగా ఆపరశక్తి అద్భుతమైన కామెడీ పండించాడు. నటుడిగా ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ``బద్రీనాథ్ కి దుల్హనియా``, ``స్త్రీ`` సినిమాల్లో అపరశక్తి మంచి నటన కనబరిచాడు (Viral).

Viral Video: చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన వ్యక్తి.. యజమానిని చూసిన ఆనందంలో ఆ పప్పీ రియాక్షన్ చూస్తే..

మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న అపరశక్తికి బాలీవుడ్ నుంచి వస్తున్న అవకాశాలు అంతంత మాత్రమే. ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా అతడు లీడ్ క్యారెక్టర్ రోల్‌లో కనిపించలేదు. దీంతో అపరశక్తి ప్రస్తుతం ఓటీటీలపై దృష్టి సారించాడు. అతడు నటించిన వెబ్ సిరీస్ ``జూబ్లీ`` చాలా మందిని ఆకట్టుకుంది. నిజ జీవితంలో లవ్ ఫెయిల్యూర్ అయిన అపరశక్తి ఇంకా ఒంటరిగానే ఉన్నాడు.

Updated Date - 2023-11-20T19:19:39+05:30 IST