India vs Pakistan: భారత్, పాక్ మ్యాచ్.. ఏకంగా 70 బిర్యానీలు ఆర్డర్ చేసిన ఛండీగఢ్ కుటుంబం.. ఎందుకంటే..
ABN , First Publish Date - 2023-10-15T15:14:11+05:30 IST
శనివారం దేశంలోని క్రికెట్ ప్రేమికులందరినీ భారత్, పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచ్ ఫీవర్ ఆవహించింది. పనులన్నీ పక్కన పెట్టి అందరూ టీవీలకు అతుక్కుపోయారు. అభిమానులను ఎక్కడా నిరాశరపరచకుండా రోహిత్ సారథ్యంలోని టీమిండియా అద్బుత ప్రదర్శన చేసింది. పాకిస్థాన్‌ను చాలా సునాయాసంగా ఓడించింది.
శనివారం దేశంలోని క్రికెట్ ప్రేమికులందరినీ భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) ప్రపంచకప్ (World Cup2023) మ్యాచ్ ఫీవర్ ఆవహించింది. పనులన్నీ పక్కన పెట్టి అందరూ టీవీలకు అతుక్కుపోయారు. అభిమానులను ఎక్కడా నిరాశరపరచకుండా రోహిత్ సారథ్యంలోని టీమిండియా అద్బుత ప్రదర్శన చేసింది. పాకిస్థాన్‌ను చాలా సునాయాసంగా ఓడించింది. దీంతో ఫ్యాన్స్ (Cricket Fans) సంబరాలు మిన్నంటాయి. ఈ ఉత్కంఠ మ్యాచ్‌ను వీక్షిస్తూ దేశవ్యాప్తంగా ఎంతో మంది రకరకాల ఆహార పదార్థాలను ఆర్డర్ చేశారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ ``స్విగ్గీ`` (Swiggy) ఆ వివరాలను వెల్లడించింది.
ఛండీగఢ్‌కు (Chandigarh) చెందిన ఓ కుటుంబం ఏకంగా 70 బిర్యానీ (70 biryanis) పార్సిళ్లను ఆర్డర్ చేసిననట్టు స్విగ్గీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ``ఛండీగఢ్‌లోని ఒక కుటుంబం ఏకంగా 70 బిర్యానీలు ఆర్డర్ చేసింది. ఎవరు గెలుస్తారో వారికి ఇప్పటికే తెలిసిపోయిందనిపిస్తోంద``ని స్విగ్గీ పేర్కొంది. ఆ ట్వీట్‌కు ``ఆర్ఆర్ఆర్`` సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ బిర్యానీ తింటున్న ఫొటోను యాడ్ చేసింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Tweet) మారింది.
స్విగ్గీ పోస్ట్ చేసిన వైరల్ ట్వీట్‌ను లక్ష మందికి పైగా వీక్షించారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``పార్టీ మోడ్``, ``అన్ని బిర్యానీలను ఎలా డెలివరీ చేశారు``, ``ఇదో బిజినెస్ టెక్నిక్``, ``వారికి ఏమైనా డిస్కౌంట్ ఇచ్చారా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.