Tomato: అతడి ఆటో ఎక్కితే కేజీ టమాటాలు ఫ్రీ అట.. కాకపోతే ఓ కండిషన్.. అది ఏంటంటే..
ABN , First Publish Date - 2023-07-19T19:28:09+05:30 IST
ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టమాటా రైతులు లక్షలు సంపాదిస్తున్నారు. కొన్నిచోట్ల టమాటా రక్షణ కోసం బౌన్సర్లను కూడా నియమిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా (Tomato) ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో టమాటా ధరలు (Tomato Prices) ఆకాశాన్ని అంటుతున్నాయి. టమాటా రైతులు లక్షలు సంపాదిస్తున్నారు. కొన్నిచోట్ల టమాటా రక్షణ కోసం బౌన్సర్లను కూడా నియమిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టమాటా డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొందరు వ్యాపారులు రకరకాల ఆఫర్లతో ముందుకొస్తున్నారు. కొన్ని రోజుల కిందట ఓ మొబైల్ షాప్ ఓనర్.. తమ షాప్‌లో మొబైల్ కొన్న వారికి రెండు కిలోల టమాటాలు ఫ్రీ అని ఆఫర్ ఇచ్చాడు.
తాజాగా ఛండీగఢ్‌కు చెందిన ఓ ఓ ఆటో డ్రైవర్ (Chandigarh's auto driver) తన ఆటోలో ప్రయాణిస్తే ఉచితంగా టమాటాలు ఇస్తానని ప్రకటించాడు. అయితే అందుకు అతను ఓ కండీషన్ పెట్టాడు. తన ఆటోలో ఐదుసార్లు ఎక్కి ప్రయాణించిన వారికి కిలో టమాటాలు ఫ్రీగా ఇస్తానని (Tomatoes Free) అరుణ్ అనే ఆటో డ్రైవర్ కండీషన్ పెట్టాడు. ఆ మేరకు తన ఆటో వెనకాల పోస్టర్లు కూడా అంటించాడు. అరుణ్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ (Viral)గా మారింది. ఇలాంటి ఆఫర్లు ప్రకటించడం అరుణ్‌కు ఇదే మొదటిసారి కాదు. అక్టోబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ గెలిస్తే.. వారంలో 5 రోజులు ఉచితంగా తన ఆటోలో ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తానని గతంలోనే ప్రకటించాడు.
Viral Video: వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే.. ఓ వ్యక్తి చెవిలో సాలీడు ఎలా తిరుగుతోందో చూడండి.. వీడియో వైరల్!
అరుణ్ 12 ఏళ్లుగా ఇండియన్ ఆర్మీ సైనికులను ఉచితంగా తన ఆటో ద్వారా గమ్యస్థానాలకు చేరుస్తున్నాడు. అలాగే గర్భిణులను కూడా ఉచితంగా హాస్పిటల్‌కు చేరుస్తుంటాడు. ఏదేమైనా అరుణ్ ప్రకటన సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. కొన్ని రోజులుగా టమాటాలు ఫ్రీ అంటూ చాలా మంది వర్తకులు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.