ChatGPT: 17 మంది డాక్టర్లు చెప్పలేని వ్యాధిని గుర్తించిన చాట్‌ జీపీటీ..

ABN , First Publish Date - 2023-09-12T18:16:29+05:30 IST

చాట్ జీపీటీ.. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీలో ఎన్ని మార్పులు తెస్తోందో అనుభవంలో ఉన్నదే. చీమ నుంచి స్పేస్ లో విశేషాల దాకా అంతా సమాచారాన్ని ఈ ఏఐ(AI) అందిస్తోంది. తాజాగా ఓ బాబుకి వచ్చిన అరుదైన వ్యాధిని గుర్తించి చాట్ జీపీటీ రికార్డు నెలకొల్పింది.

ChatGPT: 17 మంది డాక్టర్లు చెప్పలేని వ్యాధిని గుర్తించిన చాట్‌ జీపీటీ..
Chat GPT

చాట్ జీపీటీ.. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీలో ఎన్ని మార్పులు తెస్తోందో అనుభవంలో ఉన్నదే. చీమ నుంచి స్పేస్ లో విశేషాల దాకా అంతా సమాచారాన్ని ఈ ఏఐ(AI) అందిస్తోంది. తాజాగా ఓ బాబుకి వచ్చిన అరుదైన వ్యాధిని గుర్తించి చాట్ జీపీటీ రికార్డు నెలకొల్పింది. ఆ వ్యాధిని కనుక్కోవడానికి 17 మంది వైద్యులు శ్రమించినా చాట్ జీపీటీతోనే అది సాధ్యపడింది. సోషల్ మీడియా సోర్స్ ద్వారా తెలిసిన వివరాల ప్రకారం.. కోర్ట్నీ అనే మహిళకు నాలుగేళ్ల కుమారుడు అలెక్స్ ఉన్నాడు. బాబు పంటి నొప్పితో బాధ పడుతూ ఉండేవాడు. దానికి తోడు శరీరంలో ఎదుగుదల లేకపోయేది. ఆందోళన చెందిన తల్లి అనేక హాస్పిటళ్లలో చూపించింది. కానీ ఎక్కడా బాబు సమస్య ఏంటో తెలియలేదు. దాదాపు 17 మంది డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లినా నిష్ప్రయోజనమే అయింది. ఒక డాక్టర్ కొవిడ్ 19(Covid 19) వల్ల వచ్చిన దీర్ఘకాలిక ప్రభావం అని చెప్పాడు. డాక్టర్లు ఏదీ సరిగ్గా చెప్పలేకపోతుండటంతో విసుగెత్తిన తల్లి కుమారుడి క్షేమాన్ని మరవలేదు. ఈ సారి డాక్టర్ల(Doctors)ను కాకుండా టెక్నాలజీని నమ్ముకుంది.


చాట్ జీపీటీని(Chat GPT) ఆశ్రయించింది. బాబుకు ఉన్న వ్యాధి లక్షణాలను చాట్ జీపీటీతో పంచుకుంది. వ్యాధి ఏంటో కనుక్కోమని ఆదేశించింది. అది ఇచ్చిన సమాధానంతో తల్లి షాక్ తింది. బాబు టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు చాట్ జీపీటీ గుర్తించింది. ఈ విషయం ఆ నోట ఈ నోట చేరి తమ పిల్లలకు వచ్చిన వ్యాధులేంటో తెలపాలంటూ తల్లిదండ్రులు చాట్ జీపీటీని ఆశ్రయించడం ప్రారంభించారు. డాక్టర్లు కూడా వ్యాధి అదేనని నిర్ధారించడంతో చాట్ జీపీటీ పని తనాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. ఏఐ టెక్నాలజీ ప్రజల జీవితాల్లో ఇంకా ఎన్ని మార్పులు తీసుకువస్తుందో చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-09-12T18:25:04+05:30 IST