Home » Social Media
మీరు ఏదైనా ఈవెంట్ లేదా కచేరి కార్యక్రమానికి వెళ్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ధరల దోపిడీ జరుగుతుందని తెలుస్తోంది. తాజాగా చోటుచేసుకున్న అలాంటి సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పాకిస్థాన్ సైన్యం 1971 డిసెంబర్లో భారత బలగాల ముందు లొంగిపోయిన రోజును 'విజయ్ దివస్'గా జరుపుకొంటాం. బంగ్లాదేశ్ మాత్రం మార్చి 26న 'ఇండిపెండెన్స్ డే' జరుపుతుంది.
ఇంతకు ముందు వెడ్డింగ్ కార్డ్లు చాలా సింపుల్గా ఉండేవి. అందులో దేవుడి చిత్రం, వివాహానికి సంబంధించిన సమాచారం ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. పెళ్లి కార్డులను సరికొత్త మోడళ్లలో తయారు చేయించుకుంటున్నారు. అలాంటిదే ఇప్పుడు ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఆనవాళ్లను చేరిపేయడం మీ తరం కాదని.. ఆయన నిర్మించిన ఇళ్ళకు సున్నాలు వేసి.. ఇందిరమ్మ ఇళ్లని ప్రజల కళ్లకు గంతలు కట్టలేరని అన్నారు.
ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి విచారణలో సరైన సమాధానాలు చెప్పడం లేదంటూ పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. రాఘవరెడ్డిని నాలుగు రోజులుగా విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. నాలుగు రోజులపాటు జరిగిన విచారణలో రాఘవరెడ్డి సమాధానాలు దాట వేసే ధోరణిలోనే ఉన్నాయని ఆయన తెలిపారు.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెరిగిపోయాయని, ఇంట్లో ఆడవారిని సైతం వదలకుండా పోస్టులు పెడుతున్నారని జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నాదెండ్ల మనోహర్ తీసుకెళ్లారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదని నాదెండ్ల చెప్పారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు.
సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించడంతోపాటు ఇతరులను దూషించటం సహా సైబర్ నేరాలకు పాల్పడే వారిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఇంకా ఏం చెప్పిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
లైక్లు, సబ్స్ర్కైబ్లు, ఫాలోవర్ల కోసం కొందరు యువతీయువకులు కొండపై కుప్పిగంతులు వేస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు.
ఈ దాడి ఘటనపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. 'మానవత్వమా నీ జాడెక్కడ.? మూగజీవులకు ఉన్న మానవత్వం కూడా మనిషికి లేదా..?. ఎటు పోతోందీ సమాజం.?. ఇలాంటి సమాజంలో మనుగడ సాగిస్తున్నామా.. అని తలుచుకుంటేనే బాధేస్తోంది.' అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.