ఆ మామిడి రకానికి పేరు పెట్టిన ముస్లిం పాలకుడు... ఏ సందర్భంలో ఇది జరిగిందో తెలిస్తే...
ABN , First Publish Date - 2023-04-15T09:06:57+05:30 IST
వేసవి ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో జనం తమకు ఇష్టమైన పానీయాలు(Drinks) తాగుతూ, ఈ సీజన్‌లో వచ్చే పండ్లను ఆనందంగా తింటున్నారు. వేసవి సీజన్(Summer season)లో మామిడి పండ్లకు ఎనలేని గిరాకీ ఉంటుంది.
ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో జనం తమకు ఇష్టమైన పానీయాలు(Drinks) తాగుతూ, ఈ సీజన్‌లో వచ్చే పండ్లను ఆనందంగా తింటున్నారు. వేసవి సీజన్(Summer season)లో మామిడి పండ్లకు ఎనలేని గిరాకీ ఉంటుంది. కాగా చౌసా మామిడి అనేది భారతదేశం(India)లో చాలామంది ఇష్టపడే మామిడి రకం. అయితే ఈ మామిడికి చౌసా(chaunsa) అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? నిజానికి చౌసా మామిడి పండ్లను భారతదేశంలోని అనేక ప్రాంతాల్లోని జనం ఎంతో ఇష్టంగా తింటారు.
దాని రుచి ఇతర మామిడి రకాలకు కొంత భిన్నంగా ఉంటుంది. ఈ మామిడి రకానికి చౌసా అనే పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. దీని పేరు ముస్లిం పాలకుడు షేర్ షా సూరి(Muslim ruler Sher Shah Suri)తో ముడిపడివుంది. ఆయన తనకు ఇష్టమైన మామిడి రకాలలో ఒకదానికి చౌసా అనే పేరు పెట్టాడు. 1539లో బీహార్(Bihar)లోని చౌసాలో జరిగిన యుద్ధంలో షేర్ షా సూరి... హుమయూన్‌ను ఓడించాడు.
ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో తనకు ఇష్టమైన మామిడిపండు(Mango) రకానికి చౌసా అనే పేరు పెట్టాడు. అప్పటి నుండి ఈ మామిడి రకానికి అదే పేరు వచ్చింది. చౌసా మామిడి ప్రత్యేకత ఏమిటంటే మార్కెట్‌లో ఇతర మామిడి రకాల రాక తగ్గినప్పుడు, ఈ మామిడి అందుబాటులోకి వస్తుంది. ఈ మామిడి జూలైలో పక్షం రోజుల తర్వాత వస్తుంది. ఈ రకం మామిడి ప్రధానంగా భారతదేశం, పాకిస్తాన్(Pakistan)లలో కనిపిస్తుంది. ఈ రెండు దేశాలు ఈ మామిడిని గణనీయమైన పరిమాణంలో ఎగుమతి(export) చేస్తుంటాయి.