Shocking: స్వంత ఇంటి పైనే బాంబు దాడి చేసిన కర్కోటకుడు.. తండ్రి అలా అన్నాడని కొడుక్కి ఎంత కోపం వచ్చిందంటే..

ABN , First Publish Date - 2023-07-19T21:01:03+05:30 IST

తాము కోరిన వాటిని తల్లిదండ్రులు ఇవ్వకపోతే పిల్లలు ఏడుస్తారు, అలుగుతారు. కొంచెం పెద్ద పిల్లలైతే గొడవకు దిగుతారు. తల్లిదండ్రుల నుంచి బలవంతంగా లాక్కుంటారు. కానీ, చెన్నైకు చెందిన ఓ పుత్ర రత్నం అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. తాను అడిగిన డబ్బులు ఇవ్వలేదని స్వంత ఇంటి పైనే బాంబు దాడి చేశాడు.

Shocking: స్వంత ఇంటి పైనే బాంబు దాడి చేసిన కర్కోటకుడు.. తండ్రి అలా అన్నాడని కొడుక్కి ఎంత కోపం వచ్చిందంటే..

తాము కోరిన వాటిని తల్లిదండ్రులు ఇవ్వకపోతే పిల్లలు ఏడుస్తారు, అలుగుతారు. కొంచెం పెద్ద పిల్లలైతే గొడవకు దిగుతారు. తల్లిదండ్రుల నుంచి బలవంతంగా లాక్కుంటారు. కానీ, చెన్నై (Chennai)కు చెందిన ఓ పుత్ర రత్నం అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. తాను అడిగిన డబ్బులు ఇవ్వలేదని స్వంత ఇంటి పైనే బాంబు దాడి చేశాడు (Bomb attack on own house). ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు (Crime News).

వేలచ్చేరిలోని భారతీయార్ కాలనీలో నివసిస్తున్న పన్నీర్ సెల్వం అనే వ్యక్తి ఇటీవల తన పేరిట ఉన్న కొద్దిపాటి భూమిని అమ్మాడు. పొలం అమ్మగా వచ్చిన డబ్బులో రూ.3 లక్షలు తనకు ఇవ్వాలని తండ్రిని కుమారుడు అరుణ్ అడిగాడు. అందుకు పన్నీర్ సెల్వం నిరాకరించాడు. డబ్బులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో అరుణ్ కోపంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత బావమరిదితో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్లాడు. తనతో పాటు తెచ్చుకున్న బాంబును ఇంటిపై వేసి పరారయ్యాడు.

Tomato: అతడి ఆటో ఎక్కితే కేజీ టమాటాలు ఫ్రీ అట.. కాకపోతే ఓ కండిషన్.. అది ఏంటంటే..

ఆ బాంబు దాడిలో అరుణ్ చిన్నాన్న, సోదరికి గాయాలయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబు నిపుణులను పిలిపించారు. అరుణ్ తన స్వంత ఇంటిపై నాటు బాంబు వేసినట్టు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు.

Updated Date - 2023-07-19T21:01:03+05:30 IST