Shocking: ఇంటి వెనుక బూడిద కుప్ప.. చెక్ చేస్తే అందులో కనిపించిన వాటిని చూసి ఆ యువకుడికి వెన్నులో వణుకు.. చివరకు ఊహించని ట్విస్ట్..!

ABN , First Publish Date - 2023-05-19T20:10:50+05:30 IST

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి డబ్బు కోసం తన తల్లిదండ్రులతో గొడవపడి హత్య చేశారు. మృతదేహాలను తన ఇంటి వెనుకే దహనం చేశాడు. తల్లిదండ్రులు కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత ఇంటికి వచ్చిన అతడి తమ్ముడికి ఆ బూడిద కనిపించింది. దీంతో, అతడు పోలీసులను ఆశ్రయించడంతో అన్న చేసిన దురాగతం బయటపడింది. చత్తీస్‌ఘడ్‌లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.

Shocking: ఇంటి వెనుక బూడిద కుప్ప.. చెక్ చేస్తే అందులో కనిపించిన వాటిని చూసి ఆ యువకుడికి వెన్నులో వణుకు.. చివరకు ఊహించని ట్విస్ట్..!

ఇంటర్నెట్ డెస్క్: తల్లిదండ్రులను చూసేందుకు హాస్టల్‌నుంచి ఇంటికొచ్చాడా యువకుడు. వాళ్లు కనిపించకుండా పోయారని అతడి అన్న చెప్పాడు. దీంతో, ఇంటి వెనుక వెళ్లి చూడగా ఓ బూడిద కుప్ప కనిపించింది. ఆ తరువాత అతడి జీవితం ఊహించని మలుపు తిరిగింది. చత్తీస్‌ఘడ్‌లో ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

మహాసమండ్ జిల్లా పుత్కా గ్రామానికి చెందిన ఉదిత్ భోయ్(24) మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. అతడు తన తల్లిదండ్రులు, నాన్నమ్మతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి తండ్రి పక్క ఊరిలోని ఓ పాఠశాలలో టీచర్‌గా చేస్తున్నాడు. ఉదిత్ భోయ్ తమ్ముడు పక్క జిల్లాలో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే, ఉదిత్ డబ్బుల కోసం తరచూ తన కుటుంబసభ్యులతో గొడవపడుతుండేవాడు.

అయితే, ఈ నెల 12న ఉదిత్ తన తల్లిదండ్రులు, నాన్నమ్మ కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు మళ్లీ తిరిగిరాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే అతడి తమ్ముడు హాస్టల్ నుంచి ఇంటికొచ్చాడు. అన్న చెప్పింది విన్న అతడికి అసలేం జరిగిందో అర్థం కాలేదు. ఈ క్రమంలో ఇంటి వెనుక వెళ్లిన అతడికి ఓ బూడిద కుప్ప కనిపించింది.

ఏదో అనుమానం వచ్చి ఆ కుప్పను కదిలించి చూడగా మనుషుల ఎముకలు కనిపించాయి. దీంతో, అతడి ఒళ్లు జలదరించింది. మనసు ఏదో కీడు శకించడంతో అతడు ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వారు ఎముకలను తీసుకుని ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు. దీంతో, ఉదిత్ బండారం బయటపడింది. ఉదిత్ ఎప్పటిలాగే డబ్బుల కోసం తన తల్లిదండ్రులు, నాన్నమ్మతో గొడవపడి వారిని కొట్టి చంపేశాడు చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా వారి మృతదేహాలను తన ఇంటి వెనుకే తగలబెట్టాడు. ఆ తరువాత ఏమీ ఎరుగనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి తమ్ముడికి అనుమానం రావడంతో జరిగిన దారుణం గురించి వెలుగులోకి వచ్చింది.

Updated Date - 2023-05-19T20:18:17+05:30 IST