శునకాలను సినిమాకు తీసుకెళ్తున్న జనం... ఇంతకీ ఆ చిత్రంలో ఏమున్నదంటే..

ABN , First Publish Date - 2023-04-04T10:27:25+05:30 IST

శునకానికి(dog) ఉండే విధేయతకు సంబంధించిన కథలు వినడమే కాకుండా, సినిమా(movie)లలోనూ చూసే ఉంటాం. ఇప్పుడు చైనా(China)లో మరో వింత చోటుచేసుకుంది.

శునకాలను సినిమాకు తీసుకెళ్తున్న జనం... ఇంతకీ ఆ చిత్రంలో ఏమున్నదంటే..

శునకానికి(dog) ఉండే విధేయతకు సంబంధించిన కథలు వినడమే కాకుండా, సినిమా(movie)లలోనూ చూసే ఉంటాం. ఇప్పుడు చైనా(China)లో మరో వింత చోటుచేసుకుంది. చైనాలోని జనం తమ పెంపుడు కుక్కలకు(pet dogs) ప్రత్యేకంగా సినిమా చూపించేందుకు తీసుకెళ్తున్నారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌(South China Morning Post)లోని కథనం ప్రకారం ఈ సినిమా కథ(story of the movie) ఒక శునకం, దాని యజమాని అనుబంధం ఆధారంగా రూపొందించారు. ఇది జపనీస్ చిత్రానికి చైనీస్ వెర్షన్(Chinese version). ఈ సినిమా కథ కుక్కలకు సంబంధించినది కావడంతో ఇక్కడి జనం తమ పెంపుడు కుక్కలను ఈ సినిమాకు తమ వెంట తీసుకెళ్తున్నారు, తద్వారా తమ కుక్కలు కూడా ఈ సినిమా(movie) చూసి, ఏదైనా నేర్చుకుంటాయని వారు భావిస్తున్నారు.

సాధారణంగా ఎవరూ కూడా తమ పెంపుడు జంతువులను థియేటర్లకు(theaters) తీసుకెళ్లరు, అయితే చైనాలోని ఓ సోషల్ మీడియా(Social media) సైట్‌లో పోస్ట్ చేసిన వీడియోలో చాలామంది తమ పెంపుడు కుక్కలతో పాటు సినిమా హాల్‌కి వెళుతున్నట్లు కనిపిస్తోంది. నిజ జీవితం(real life)లో ఒక శునకం తన యజమాని విషయంలో చూపించిన విధేయత(Loyalty) చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.

ఈ చిత్రం జపనీస్ చిత్రం హచికో మోనోగటారికి(Hachiko Monogatari) చైనీస్ వెర్షన్. ఈ సినిమా ఒక ప్రొఫెసర్‌(Professor)కి, అతని పెంపుడు కుక్కకి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. సినిమాలో యజమాని(owner) చనిపోయిన తర్వాత అతను తిరిగివస్తాడని చనిపోయే వరకు ఆ శునకం రైల్వే స్టేషన్‌(Railway station)లో వేచి ఉంటుంది.

Updated Date - 2023-04-04T11:16:17+05:30 IST