Viral: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని చెప్పిన యువకుడు.. ఏకంగా పెళ్లే రద్దు చేసుకున్న యువతి.. అసలు కథేంటంటే..
ABN , First Publish Date - 2023-03-25T19:11:20+05:30 IST
కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న యువతీయువకులు చాలా సంతోషంగా, ఉత్సుకతతో తమ వైవాహిక జీవితం గురించి కలలు కంటూ ఉంటారు. పెళ్లి తర్వాత తమ జీవితం ఎలా ఉండాలో ముందుగానే డిసైడ్ చేసుకుంటారు
కొత్తగా పెళ్లి (Marriage) చేసుకోబోతున్న యువతీయువకులు చాలా సంతోషంగా, ఉత్సుకతతో తమ వైవాహిక జీవితం గురించి కలలు కంటూ ఉంటారు. పెళ్లి తర్వాత తమ జీవితం ఎలా ఉండాలో ముందుగానే డిసైడ్ చేసుకుంటారు. ఆ మేరకు ఒకరితో మరొకరు తమ ఆలోచనలను పంచుకుంటారు. అయితే అలా చేయడమే ఓ పెళ్లికి అడ్డంకిగా మారింది. తను చెప్పిన దానికి కాబోయే భర్త అంగీకరించకపోవడంతో యువతి ఆ పెళ్లిని రద్దు చేసుకుని వేరే యువకుడిని వివాహం చేసుకుంది. చైనాలో (China) ఈ ఘటన జరిగింది. ఆ యువకుడు సోషల్ మీడియా ద్వారా తన బాధను పంచుకున్నాడు.
చైనాకు చెందిన ఓ యువతి కొద్ది రోజులుగా ఓ అబ్బాయితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉంది. ఇద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇటీవల ఇద్దరూ తమ వైవాహిక జీవితం గురించి మాట్లాడుకున్నారు. ఆ సందర్భంలో యువతి.. తన కాబోయే భర్తను ఒక కోరిక కోరింది. ఉద్యోగంలో వార్షిక బోనస్ (Annual Bonus) ఏమైనా వస్తే తనకు ఇవ్వాలని కోరింది. అందుకు ఆ యువకుడు అంగీకరించలేదు. దాంతో ఆ యువతికి కోపం వచ్చింది. ఇంటికి వెళ్లిన తర్వాత ``పెళ్లి క్యాన్సిల్`` అంటూ యువకుడికి మెసేజ్ పెట్టింది.
Viral: తన భర్తకు మరో యువతిని గిఫ్ట్‌గా ఇచ్చిన భార్య.. ఇదంతా ఆమె ఎందుకు చేసిందో తెలిస్తే షాకవక తప్పదు..
చిన్న విషయానికి హర్ట్ అయిన ప్రేయసి ఏకంగా పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడంతో ఆ యువకుడు షాక్ అయ్యాడు. అంతే కాదు.. ముందుగా అనుకున్న రోజునే ఆ యువతి మరో యువకుడిని వివాహం చేసుకుంది. సదరు యువకుడు సోషల్ మీడియా ద్వారా తన బాధను పంచుకున్నాడు. చిన్న కారణంతో నాలుగేళ్ల బంధాన్ని కాదని, మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని బాధను వ్యక్తం చేశాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.