Chiranjeevi: పవన్‌ ఫ్యాన్‌గా.. ఆ రెండూ రిపీట్‌!

ABN , First Publish Date - 2023-02-21T19:47:44+05:30 IST

కొన్ని సినిమాల్లో సన్నివేశాల్లో ఎప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంటాయి. విడుదలై ఎన్ని సంవత్సరాలు అయినా ప్రేక్షకుల మదిలో అలా గర్తుండిపోతాయి. అలాంటి వాటిలో ‘ఖుషి’(Kushi) సినిమాలో నడుమ సీన్‌ ఒకటి.

Chiranjeevi: పవన్‌ ఫ్యాన్‌గా.. ఆ రెండూ రిపీట్‌!

కొన్ని సినిమాల్లో సన్నివేశాల్లో ఎప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంటాయి. విడుదలై ఎన్ని సంవత్సరాలు అయినా ప్రేక్షకుల మదిలో అలా గర్తుండిపోతాయి. అలాంటి వాటిలో ‘ఖుషి’(Kushi) సినిమాలో నడుమ సీన్‌ ఒకటి. భూమిక చదువుకుంటుండగా గాలికి చీర పక్కకు జరిగగా పవన్‌ తదేకంగా ఆమె నడుమును చూసే సన్నివేశం, దానికి మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం ఇప్పటికీ ఆడియన్స్‌ను విపరీతంగా అలరిస్తుంది. ఇప్పుడు అదే సీన్‌ రిపీట్‌ కానుందని సమాచారం. ఆ సన్నివేశాన్ని చిరంజీవి(Chiranjeevi), శ్రీముఖిపై (Shrimukhi)చిత్రీకరించారట దర్శకుడు మెహర్‌ రమేశ్‌(mehar ramesh). ఈ చిత్రంలోనే చిరు- శ్రీముఖిపై ‘ఖుషి’ నడుము సీన్‌ను రిపీట్‌ చేశారని, ఆ సన్నివేశానికి కొంత వినోదాన్ని జోడించి తెరకెక్కించారని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఇందులో చిరంజీవి పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్‌గా కనిపిస్తారని అందుకే పవన్‌ నటించిన సినిమాలో సీన్‌ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ‘ఖుషి’ సన్నివేశాన్ని పెట్టారట. ఇదే కాకుండా చిరంజీవి సూపర్‌హిట్‌ చిత్రం చూడాలనివుంది’లోని ‘రామ్మా చిలకమ్మా’ పాటను ఈ చిత్రం కోసం రీమిక్స్‌ చేస్తున్నారని టాక్‌. అయితే దీనిపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన లేదు. కానీ ఇదే నిజమైతే అటు చిరు అభిమానులకు, పవన్‌ అభిమానులకు పండగే! తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. (Chiranjeevi as pspk Fan)

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-02-21T19:56:17+05:30 IST

News Hub