Coca Cola Formula: కంపెనీలోని అధికారి మొదలు డెలివరీ సిబ్బంది వరకూ ఎవరికీ తెలియని కోకా-కోలా ఫార్ములా... ఇద్దరికే తెలిసిన ఆ రహస్యం.. ఎంత భద్రం అంటే...

ABN , First Publish Date - 2023-03-13T10:04:59+05:30 IST

Coca Cola Formula: భారతదేశంలో కోకా-కోలా 56 శాతం (2017 నాటికి) మార్కెట్ వాటా(Market share)ను కలిగి ఉంది. ఈ శీతల పానీయాల దిగ్గజం తన ప్రత్యేక ఫార్ములా(Special formula) ఆధారంగా వ్యాపారాన్ని విస్తరించింది.

Coca Cola Formula: కంపెనీలోని అధికారి మొదలు డెలివరీ సిబ్బంది వరకూ ఎవరికీ తెలియని కోకా-కోలా ఫార్ములా... ఇద్దరికే తెలిసిన ఆ రహస్యం.. ఎంత భద్రం అంటే...

Coca Cola Formula: భారతదేశంలో కోకా-కోలా 56 శాతం (2017 నాటికి) మార్కెట్ వాటా(Market share)ను కలిగి ఉంది. ఈ శీతల పానీయాల దిగ్గజం తన ప్రత్యేక ఫార్ములా(Special formula) ఆధారంగా వ్యాపారాన్ని విస్తరించింది. అయితే ఈ ఫార్ములా ఏమిటనేది ఇప్పటికీ రహస్యం(secret)గానే ఉంది. కోకాకోలా ఫార్ములా ఎలా లాక్(Lock) అయివున్నదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వాల్ట్ కంపెనీ(Vault Company) ప్రధాన కార్యాలయం అట్లాంటాలో ఉంది. ఈ ఫార్ములా విషయంలో తరచూ వివాదాలు జరుగుతుంటాయి. మార్కెట్‌లో ఈ ఫార్ములా(formula) లీక్ అవుతున్నదనే విషయం కూడా తెరపైకి వచ్చింది, అయితే దీనిపై కంపెనీ వాదన భిన్నంగా ఉంది. కోకాకోలా తయారీ రహస్య ఫార్ములా గురించి తరచూ చర్చ జరుగుతుంటుంది. కంపెనీలో పనిచేసే అధికారులకు(authorities) సైతం ఈ ఫార్ములా గురించి తెలియదు. కంపెనీకి చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌(Executive)లకు మాత్రమే దీని రహస్యం తెలుసునని చెబుతుంటారు.

అయితే ఈ ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లకు ఫార్ములాలోని సగభాగం ఒకరికి మరొక సగభాగం మరొకరికి తెలుసునని చెబుతుంటారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఫార్ములా పరిజ్ఞానం(knowledge) కారణంగా ఈ ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లను ఎప్పుడూ కలిసి ఒకచోట ఉండనివ్వరు. కంపెనీ వ్యూహం ప్రకారం, ఈ ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌ల ప్రయాణాలు కూడా విడివిడిగా ఉంటాయి. ఫార్ములా గోప్యతకు సంబంధించి 2011వ సంవత్సరంలో ఈ ఫార్ములా దాని స్థానంలో సురక్షితం(safe)గా ఉందని, అది బయటకు లీక్ కాలేదని కంపెనీ ఒక ప్రకటన కూడా చేసింది. ఈ ఫార్ములాను కంపెనీకి చెందిన ఏ ఉద్యోగి లేదా అధికారి బయటకు వెల్లడించలేదని పేర్కొంది.

ఈ ఫార్ములా అసలు కాపీ అట్లాంటా(Atlanta)లోని సన్ ట్రస్ట్ బ్యాంక్‌లో ఉంది. ఈ రహస్య ఫార్ములా 1886 సంవత్సరంలో అట్లాంటాలో రూపొందింది. జాన్ ఎస్. పెంబర్టన్(John S. Pemberton) నాటి రోజుల్లో మందుల దుకాణాన్ని నడిపేవాడు. అతను తన ఇంటి వెనుక ఉన్న కెటిల్‌లో వివిధ మూలికలు, పదార్థాలను ఉడకబెట్టడం ద్వారా కోకాకోలా ఫార్ములా(Coca-Cola formula) తయారు చేశాడంటారు.

Updated Date - 2023-03-13T10:08:40+05:30 IST