చిల్లర నాణేలతో వాహనం కొనుగోలు చేయవచ్చా? చట్టం ఏమి చెబుతోంది?... ఎంత చిల్లరతో షాపింగ్ చేయవచ్చో తెలిస్తే...

ABN , First Publish Date - 2023-03-30T11:53:14+05:30 IST

coin payment rules: అప్పుడప్పుడు చిల్లర నాణేలతో వాహనాలను(Vehicles), ఇతర భారీ వస్తువులను ఎవరెవరో కొనుగోలు చేశారనే వార్తలను చూస్తుంటాం నిజంగా ఇలా చేయవచ్చా? అంటే చట్టం(Law) అందుకు అనుమతి లేదనే చెబుతోంది.

చిల్లర నాణేలతో వాహనం కొనుగోలు చేయవచ్చా? చట్టం ఏమి చెబుతోంది?... ఎంత చిల్లరతో షాపింగ్ చేయవచ్చో తెలిస్తే...

coin payment rules: అప్పుడప్పుడు చిల్లర నాణేలతో వాహనాలను(Vehicles), ఇతర భారీ వస్తువులను ఎవరెవరో కొనుగోలు చేశారనే వార్తలను చూస్తుంటాం నిజంగా ఇలా చేయవచ్చా? అంటే చట్టం(Law) అందుకు అనుమతి లేదనే చెబుతోంది. ఈ చట్టం ఇంకా ఏమేమి చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం. నాణేల చట్టం- 2011లోని సెక్షన్ 4 నిబంధనల ప్రకారం రూపాయి, అంతకంటే ఎక్కువ నాణేలతో రూ. 1000 వరకు మాత్రమే చెల్లింపులు(Payments) జరపవచ్చు.

అంటే మీరు నాణేలతో రూ.1000 వరకు మాత్రమే షాపింగ్(Shopping) చేయవచ్చు. 50 పైసల నాణేలలో ఏదైనా చెల్లింపులు చేయాలనుకుంటే, రూ.10 వరకు మాత్రమే చెల్లించవచ్చు. ఇప్పుడు 50 పైసలు, అంతకంటే తక్కువ విలువ(Low value) కలిగిన నాణేలు చెలామణిలో లేవు. అయితే మీ వద్ద అధికంగా నాణేలు ఉంటే, ఆ నాణేలను బ్యాంకు(Bank)లో డిపాజిట్ చేయవచ్చు.

బ్యాంకులో నాణేలను డిపాజిట్ చేయడానికి ఎటువంటి పరిమితి లేదు. ఎవరైనా తమ ఖాతాలో ఎన్ని నాణేలనైనా డిపాజిట్(Deposit) చేయవచ్చు. బ్యాంకుల్లో ఖాతాదారులు నాణేలను డిపాజిట్ చేసేందుకు ఎలాంటి పరిమితి(limit) విధించలేదని రిజర్వ్ బ్యాంక్(రిజర్వ్ బ్యాంక్) తెలిపింది. ఈ విషయంలో బ్యాంకులను స్వతంత్రం(independent)గా ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో ఒకటి, రెండు, ఐదు, పది, ఇరవై రూపాయల నాణేలు చెలామణిలో ఉన్నాయి.

Updated Date - 2023-03-30T12:02:58+05:30 IST