Couple Toilet: ‘నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను’ అని జీవిత భాగస్వామితో చెబుతున్నారా?.. అయితే మీ హామీని ఇది సంపూర్ణం చేస్తుంది!
ABN , First Publish Date - 2023-04-25T06:55:19+05:30 IST
Couple Toilet Details: కపుల్ టాయిలెట్ అనే పదాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? కనీసం దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటిది ఒకటి ఉంటుందని తెలియని చాలామంది...
Couple Toilet Details: కపుల్ టాయిలెట్ అనే పదాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? కనీసం దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటిది ఒకటి ఉంటుందని తెలియని చాలామంది కోసం కపుల్ టాయిలెట్(Couple Toilet)కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలియజేస్తున్నాం నిజానికి, ఈ టాయిలెట్ S ఆకారంలో ఉంటుంది.
ఇందులో ఒకే టాయిలెట్‌కు రెండు కమోడ్‌లు(Two commodes) ఉంటాయి. ఫలితంగా ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా దీనిని వినియోగించవచ్చు. ఈ టాయిలెట్ వినియోగించేటప్పుడు ఒకరి ముఖాలు మరొకరు చూసుకోవచ్చు. పాశ్చాత్యదేశాల్లో(Western countries) దీనిని చాలామంది జంటలు ఇష్టపడుతున్నాయి. ఇటువంటి టాయిలెట్ల ప్రత్యేక రూపకల్పనకు పలు కంపెనీలు భారీ మెత్తంలో ఛార్జ్ చేస్తున్నాయి.
దీన్ని తయారు చేయడం వెనుక ఒక అర్థం ఉందని పలు టాయిలెట్ కంపెనీలు చెబుతున్నాయి. దంపతులు(couple) కలిసి తింటారు, కలిసి కబుర్లు చెప్పుకుంటారు, కలిసి పడుకుంటారు, కలిసి స్నానం చేస్తారు, అలాంటప్పుడు కలిసి టాయిలెట్ ఎందుకు ఉపయోగించకూడదని ఆయా కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ విధమైన మరుగుదొడ్ల మధ్యలో డ్యూయల్-ఫ్లష్ బటన్(Dual-flush button) ఉంటుంది. అది ఒకేసారి రెండు కమోడ్‌లనూ ఫ్లష్ చేస్తుంది. దీనిని వినియోగించే జంట ఒకరితో ఒకరు సులభంగా మాట్లాడుకోగలుగుతుంది.
ఆ సమయంలో కూడా వారి ప్రేమకు(love) అవాంతరం ఏర్పడదు. కమర్షియల్ స్టార్స్ కెవిన్ నీలాన్, విక్టోరియా జాక్సన్(Victoria Jackson) కంపెనీలు 1991వ సంవత్సరంలోనే ఈ తరహా టాయిలెట్లను రూపొందించాయి. ఇప్పుడు ఇది ట్రెండ్‌లో నిలిచింది. అయితే ఈ తరహా టాయిలెట్‌పై లెక్కలేనన్ని మీమ్స్ సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతున్నాయి.