Wife: ఆమె భర్త చనిపోయాడని తేల్చేందుకు 10 ఏళ్లు పట్టింది.. 2013వ సంవత్సరం నుంచి న్యాయపోరాటం చేస్తే..!

ABN , First Publish Date - 2023-08-28T20:40:59+05:30 IST

ఆ మహిళ వయసు 59 ఏళ్లు.. పదేళ్ల క్రితం ఆమె భర్త ఓ షిప్‌లో పని చేయడానికి వెళ్లి కనిపించకుండా పోయాడు.. అతడి కోసం ఎంతగా వెతికినా ఎలాంటి ఆచూకీ దొరకలేదు.. అతడి మృతదేహం కూడా లభ్యం కాలేదు.. దీంతో అతడు చనిపోయినట్టు నిర్ధారించే సర్టిఫికేట్ కోసం అతడి భార్య పదేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతోంది..

Wife: ఆమె భర్త చనిపోయాడని తేల్చేందుకు 10 ఏళ్లు పట్టింది.. 2013వ సంవత్సరం నుంచి న్యాయపోరాటం చేస్తే..!

ఆ మహిళ వయసు 59 ఏళ్లు.. పదేళ్ల క్రితం ఆమె భర్త (Husband Missing) ఓ షిప్‌లో పని చేయడానికి వెళ్లి కనిపించకుండా పోయాడు.. అతడి కోసం ఎంతగా వెతికినా ఎలాంటి ఆచూకీ దొరకలేదు.. అతడి మృతదేహం కూడా లభ్యం కాలేదు.. దీంతో అతడు చనిపోయినట్టు నిర్ధారించే సర్టిఫికేట్ కోసం అతడి భార్య పదేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతోంది.. ఈ కేసును పదేళ్లు విచారించిన సిటీ సివిల్ కోర్టు ఎట్టకేలకు ఆమె భర్త చనిపోయినట్టు (Civil Dead) ప్రకటించింది.

ముంబై (Mumbai)కి చెందిన స్మిత పుత్తన్‌వీటిల్ అనే మహిళ భర్త జయరామన్ 2013 జూన్ 22న ఓ షిప్‌ (Ship)లో పని చేయడం కోసం లైబీరియాకు వెళ్లాడు. లైబీరియా నుంచి పోలాండ్ వెళ్తున్న షిప్‌లో సిబ్బందిగా జాయిన్ అయ్యాడు. అదే ఏడాది ఆగస్టు 14 వరకు భార్యకు క్రమం తప్పకుండా ఫోన్ చేసేవాడు. రెండ్రోజుల తర్వాత ఓడ సిబ్బంది స్మితను సంప్రదించి.. జయరామన్ మిస్ అయ్యాడని, అతడి గురించి ఆచూకీ దొరకలేదని తెలిపారు. దీంతో స్మిత ముంబైలోని స్థానిక పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కేసు (Missing Case) ఫైల్ చేసింది.

Parents: లెక్కల పరీక్షలో కూతురికి సున్నా మార్కులు.. జవాబు పత్రంపై సంతకం పెట్టి ఆ బాలిక తల్లి ఏం రాసిందో చదివితే..!

పోలీసులు కూడా అతడి గురించి అన్ని ఎంక్వైరీలు చేసి ఎక్కడా సమాచారం లభించకపోవడంతో చేతులెత్తేశారు. దీంతో ఆ మహిళ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించి తన భర్త మరణించినట్టు ధ్రువీకరణ సర్టిఫికెట్ కావాలని పిటిషన్ వేసింది. ఆ కేసును పదేళ్లు విచారించిన కోర్టు తాజాగా తుదితీర్పు వెలువరించింది. ``ఈ పదేళ్లలో జయరామన్ బతికే ఉన్నట్టు ఎవరూ ముందుకొచ్చి చెప్పలేదు. కాబట్టి అతడు చనిపోయినట్టు కోర్టు భావిస్తోంద``ని న్యాయమూర్తి తెలిపారు.

Updated Date - 2023-08-28T20:40:59+05:30 IST