మురుగు కాలువలో నోట్ల కట్టలు.. ఎగబడిన జనం.. పోలీసుల రాకతో...
ABN , First Publish Date - 2023-05-07T11:00:49+05:30 IST
బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో ఆ సమయంలో కలకలం చెలరేగింది. ఓ మురుగు కాలువలో నోట్ల కట్టలు(Bundles of notes) కనిపించాయనే వార్తతో స్థానికులంతా ఆ ప్రాంతానికి తరలివచ్చారు.
బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో ఆ సమయంలో కలకలం చెలరేగింది. ఓ మురుగు కాలువలో నోట్ల కట్టలు(Bundles of notes) కనిపించాయనే వార్తతో స్థానికులంతా ఆ ప్రాంతానికి తరలివచ్చారు. పెద్ద ఎత్తున జనం కాలువ వద్దకు చేరుకుని డబ్బుల కోసం వెదుకులాట సాగించారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా వారంతా నోట్ల కట్టల కోసం వెదికారు. ఈ ఘటన సాసారంలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు(police) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, ప్రజలను నియంత్రించలేకపోయారు. అయితే పోలీసులు ఇవి వదంతులు మాత్రమేనని చెబుతున్నారు. స్థానికులు మాత్రం తమకు నోట్ల కట్టలు దొరికాయని అంటున్నారు. తాము కాలువలో నోట్లు తేలడాన్ని గుర్తించామని వారు అంటున్నారు. కాలువలోకి దిగి డబ్బులు కోసం వెదికామన్నారు. ఈ సమాచారం(Information) కొద్దిసేపటికే ఊరంతా పాకిపోయిందన్నారు. దీంతో చాలా మంది కాలువ వద్దకు వచ్చి డబ్బుల కోసం వెదుకులాట(search) సాగించారన్నారు.