మెట్రో రూట్‌లకు వివిధ రంగులను ఎందుకు కేటాయిస్తారు? ఈ కలర్ కోడింగ్ వెనుక కారణమేమిటో తెలిస్తే...
ABN , First Publish Date - 2023-04-30T10:17:02+05:30 IST
ఇప్పుడున్న కాలంలో అత్యధికులకు ఇష్టమైన ప్రయాణ సాధనం మెట్రో(Metro). దీనిలో ప్రయాణం ఎంతో సౌకర్యవంతమని భావిస్తుంటారు. అయితే మెట్రో గురించిన కొన్ని విషయాలు చాలామందికి తెలియదు.
ఇప్పుడున్న కాలంలో అత్యధికులకు ఇష్టమైన ప్రయాణ సాధనం మెట్రో(Metro). దీనిలో ప్రయాణం ఎంతో సౌకర్యవంతమని భావిస్తుంటారు. అయితే మెట్రో గురించిన కొన్ని విషయాలు చాలామందికి తెలియదు.
అలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీ మెట్రో సర్వీస్(Delhi Metro Service)ను మొత్తం తొమ్మిది కలర్ కోడ్‌లుగా విభజించారు. వీటిలో వివిధ మార్గాలకు వేర్వేరు రంగులను ఎంపిక చేశారు. ఇందులో పసుపు, ఆకుపచ్చ(green), ఎరుపు, గులాబీ, నీలం మొదలైనవి ఉన్నాయి. ఢిల్లీ మెట్రోలో ఈ మార్గాలే కాకుండా ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్(Airport Express Line) మార్గం కూడా ఉంది. కాగా పలు రూట్లలో పనులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మెట్రోలో ఎల్లో, పింక్, రెడ్, బ్లూ, గ్రీన్, మెజెంటా(Magenta), వైలెట్, గ్రే మరియు ఆక్వా లైన్ మార్గాల్లో మెట్రో నడుస్తుంది. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్(Airport Express Line)కు ఆరెంజ్ రంగు కోడ్ కేటాయించారు.
ఢిల్లీ మెట్రోలో ప్రారంభించిన మొదటి రూట్ రెడ్ లైన్. ఇది మొదట్లో దిల్షాద్ గార్డెన్ నుండి రితాలా వరకు నడిచేది. తర్వాత దీనిని ఘజియాబాద్ వరకు పొడిగించారు. మెట్రో మార్గాలకు వేర్వేరు రంగులను కేటాయించడానికి వెనుక ఒక కారణముంది. ఈ విధానం కారణంగా వాటిని సులభంగా గుర్తించవచ్చు. ఢిల్లీ మెట్రోలో అన్ని రకాల ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. నిరక్షరాశ్యులు(Illiterates) కూడా కలర్ కోడ్ ద్వారా మెట్రో ప్రయాణ మార్గాన్ని సులభంగా గుర్తించగలుగుతారు. మెట్రో ప్రయాణికుల సౌకర్యం(comfort) కోసమే వాటికి ఇలా రంగులను కేటాయించారు.