Viral Video: పోలీసుల ఎదురుగా కొడుకును, కోడలిని కొట్టిన మహిళ.. ఎందుకో తెలిస్తే షాకవకుండా ఉండలేరు!
ABN , First Publish Date - 2023-05-14T12:00:08+05:30 IST
రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ జంట బైక్‌పై వెళుతోంది. అంతలో ఓ మహిళ వెనుక నుంచి పెద్దగా అరుచుకుంటూ పరిగెత్తి వచ్చింది. వారిద్దరినీ ఆపింది. వెనుక కూర్చున్న యువతిని కొట్టి బైక్ నుంచి కిందకు దింపింది.
రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ జంట బైక్‌పై (Bike) వెళుతోంది. అంతలో ఓ మహిళ వెనుక నుంచి పెద్దగా అరుచుకుంటూ పరిగెత్తి వచ్చింది. వారిద్దరినీ ఆపింది. వెనుక కూర్చున్న యువతిని కొట్టి బైక్ నుంచి కిందకు దింపింది. బైక్ నడుపుతున్న యువకుడిని కూడా కొట్టి కేకలు వేసింది. ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి పోలీసులు అక్కడికి వెళ్లారు. అసలు విషయం తెలుసుకుని షాకయ్యారు. హెల్మెట్ (Helmet) పెట్టుకోకుండా బైక్ మీద వెళ్తున్న కొడుకును, కోడలిని తల్లి (Mother) మందలిస్తోందని తెలుసుకుని ఆమెను అభినందించారు.
తల్లి హెచ్చరించడంతో ఆ ఇద్దరూ హెల్మెట్లు పెట్టుకుని బైక్‌పై ముందుకు వెళ్లారు (Mother beats up son, daughter-in-law). ఆ తర్వాత ఆ మహిళ ఇంటికి వెళ్లిపోయింది. ఆ ఘటన మొత్తాన్ని రోడ్డుపై ఉన్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఇప్పటివరకు ఆ వీడియోను 65 వేల మంది వీక్షించారు. 6 వేల మంది లైక్ చేశారు. ఆ తల్లి ప్రవర్తనపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు.
Funny Viral Video: ఆహా.. దర్జా అంటే ఇదీ.. మందు కొడుతూ ట్రెడ్‌మిల్‌పై వాకింగ్.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!
``హెల్మెట్ ధరించలేదని నడిరోడ్డుపై కొడుకును కొట్టిన తల్లికి హ్యాట్సాప్``, ``ఆమె నిజమైన తల్లి. పిల్లల జాగ్రత్త కోసం ఎంత తపన పడుతోందో``, ``ఇది చాలా గొప్ప పని. ఆమె ఎంతో మందికి ఆదర్శం`` అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.