Bail after Death: చనిపోయిన రెండ్రోజుల తర్వాత బెయిల్ ఇచ్చిన కోర్టు.. ఆరోగ్యం బాగాలేదంటూ ఓ ఖైదీ బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటే..!
ABN , First Publish Date - 2023-06-07T19:36:59+05:30 IST
ఆ వ్యక్తిని రెండేళ్ల క్రితం ముంబై పోలీసులు చీటింగ్, ఫోర్జరీ కేసుల కింద అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతను కటకటాల వెనుకే ఉన్నాడు. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కేసుపై విచారణ కొనసాగుతోంది. అతడు చాలా రోజులుగా తీవ్రమైన మధుమేహం, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు.
ఆ వ్యక్తిని రెండేళ్ల క్రితం ముంబై పోలీసులు (Mumbai Police) చీటింగ్, ఫోర్జరీ కేసుల కింద అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతను కటకటాల వెనుకే ఉన్నాడు. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కేసుపై విచారణ కొనసాగుతోంది. అతడు చాలా రోజులుగా తీవ్రమైన మధుమేహం (Diabetis), వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. అంతేకాదు గ్యాంగ్రిన్ (Gangrene) కారణంగా అతడి కాలును తొలగించాల్సి వచ్చింది. ఇన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తనకు బెయిల్ ఇప్పించాలని కోరుతూ అతడు పిటిషన్ (Bail Plea) వేసుకున్నాడు. అతడి పిటిషన్‌పై సుదీర్ఘంగా విచారించిన కోర్టు చివరకు బెయిల్ మంజూరు చేసింది. అయితే అప్పటికి రెండ్రోజుల ముందే అతడి మరణించాడు.
సురేశ్ పవార్ అనే నిందితుడికి ముంబై సెషన్స్ కోర్టు (Mumbai Sessions Court) తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అయితే అతను అప్పటికే మరణించి రెండు రోజులైంది. 2021లో నిందితుడు సురేష్‌పై ముంబై పోలీసులు చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతను కటకటాల వెనుకే ఉన్నాడు. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కేసుపై విచారణ కొనసాగుతోంది. తాను మధుమేహం, వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుపుతూ సురేష్ బెయిల్ కోసం పిటిషన్ వేశాడు.
Lovers: తప్పు చేశాం.. క్షమించండని మోకాళ్లపై కూర్చుని ఈ ప్రేమ జంట వేడుకున్నా వదల్లేదు.. చివరకు అన్నంత పనీ చేశారు..!
ఐదు నెలల క్రితం సురేష్ కాలి బొటనవేలికి గాయమైంది. అతడికి పోలీసులు చికిత్స అందించినా ఫలితం కనిపించలేదు. ఆ గాయం సెప్టిక్‌గా మారడంతో సురేష్ కాలును మోకాలి కింద వరకు కత్తిరించాల్సి వచ్చింది. అంతే కాదు అతని ఊపిరితిత్తులలో కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ విషయాలన్నీ తెలుపుతూ సురేష్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశాడు. పలు వాయిదాల అనంతరం కోర్టు సురేష్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ తీర్పు రావడానికి రెండ్రోజుల ముందే అనారోగ్యం కారణంగా సురేష్ మరణించాడు. సురేష్ మరణించిన విషయాన్ని పోలీసులు కోర్టుకు తెలకపోవడంతో బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగింది.