రివాల్వర్.. పిస్టల్ రెండూ ఒకటేనా? వాటి పనితీరులో తేడాలేమిటి?... ఈ సందేహానికి సమాధానమిదే!

ABN , First Publish Date - 2023-04-19T10:31:53+05:30 IST

రివాల్వర్, పిస్టల్(Revolver, pistol) విషయంలో చాలామంది సరైన అర్థం తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ రెండింటి మధ్యగల తేడా ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

రివాల్వర్.. పిస్టల్ రెండూ ఒకటేనా? వాటి పనితీరులో తేడాలేమిటి?... ఈ సందేహానికి సమాధానమిదే!

రివాల్వర్, పిస్టల్(Revolver, pistol) విషయంలో చాలామంది సరైన అర్థం తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ రెండింటి మధ్యగల తేడా ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

రివాల్వర్

రివాల్వర్ ఒక రకమైన తుపాకీ(gun). ఇందులో రివాల్వింగ్ సిలిండర్‌లో బుల్లెట్లు ఉంటాయి. రివాల్వర్‌తో షూట్ చేసినప్పుడు సిలిండర్(cylinder) దానికదే తిరుగుతుంది. అలా రెండవ బుల్లెట్ బారెల్ ముందు వైపునకు వస్తుంది. ఇందులో ప్రధానంగా 6 బుల్లెట్లు ఉంటాయి.

రివాల్వర్ నుంచి బుల్లెట్లు(Bullets) అయిపోయిన తర్వాత సిలిండర్ బయటకు తీసి, అందులో తిరిగి బుల్లెట్లు నింపుతారు. రివాల్వర్‌ను 1836లో శామ్యూల్ కోల్ట్(Samuel Colt) తయారుచేశాడు. రివాల్వింగ్ సిలిండర్ కారణంగా దీనికి రివాల్వర్ అనే పేరు పెట్టారు. ఇది చాలా ఏళ్లుగా ఉపయోగంలో ఉంది. దీని పరిధి 50 నుండి 100 మీటర్ల వరకు ఉంటుంది.

పిస్టల్

పిస్టల్ గురించి చెప్పుకోవలసివస్తే.. అది చేతి తుపాకీకి చెందిన అప్‌గ్రేడ్ వెర్షన్(Upgraded version). ఇందులో బుల్లెట్లు తిరిగే సిలిండర్‌ ఉండదు. దానికి అనుబంధంగా ఒక మ్యాగజైన్ ఉంటుంది. అది పిస్టల్‌లోని స్ప్రింగ్ ద్వారా బుల్లెట్ ఫైర్ పాయింట్(Fire point) వద్ద అమరివుంటుంది. దీనిలో ఒకదాని తర్వాత ఒకటి షూట్ చేయవచ్చు.

ఇది రివాల్వర్ కంటే చాలా వేగంగా కాల్పులు జరుపుతుంది. అలాగే ఇందులో బుల్లెట్లు నింపేందుకు ఎక్కువ సమయం పట్టదు. ఇందులో గరిష్టంగా 20 బుల్లెట్లను నింపవచ్చు. దీని పరిధి(Range) 50 నుండి 100 మీటర్ల వరకు ఉంటుంది. ఇది ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్(Semi automatic) రకాల్లో ఉంటుంది. ఆటోమేటిక్ పిస్టల్‌లో ట్రిగ్గర్‌ను(trigger) నొక్కాలి. దీని వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

Updated Date - 2023-04-19T10:40:29+05:30 IST