RC15: హైదరాబాద్‌లో రామ్ చరణ్ మూవీ షూటింగ్

ABN , First Publish Date - 2023-02-09T20:48:15+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ఓ మార్కును సృష్టించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). ‘రంగ స్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలతో తనలో మంచి నటుడు ఉన్నారని నిరూపించుకున్నారు.

RC15: హైదరాబాద్‌లో రామ్ చరణ్ మూవీ షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ఓ మార్కును సృష్టించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). ‘రంగ స్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలతో తనలో మంచి నటుడు ఉన్నారని నిరూపించుకున్నారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో నటిస్తున్నారు. కియారా అడ్వాణీ (Kiara Advani) హీరోయిన్ పాత్రను పోషిస్తున్నారు. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు వర్కింగ్ టైటిల్‌గా ‘ఆర్‌సీ15’ (RC15) అని వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ శంకర్ సోషల్ మీడియాలో తెలిపారు.

Shankar.jpg

‘ఆర్‌సీ15’ నెక్ట్స్ షెడ్యూల్ ఐకానిక్ చార్మినార్ వద్ద ప్రారంభం కానుంది. ఆ చారిత్రక కట్టడం వద్ద శంకర్ ఫొటో తీసుకుని ఈ విషయాన్ని అభిమానులకు చెప్పారు. ఆ పిక్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మూవీ టైటిల్‌ను చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27న వెల్లడించనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్వి పాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐఏఏస్ ఆఫీసర్‌తో పాటు మరో పాత్రను చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. చరణ్ ఐఏఏస్ ఆఫీసర్ పాత్రకు కియారా, మరో పాత్రకు అంజలి జోడీగా నటిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. శంకర్ ఒకేసారి ‘ఇండియన్ 2’, ‘ఆర్‌సీ15’ రెండు సినిమాలకు దర్శకత్వం వహిస్తుండటంతో నెలలో సగం రోజులు మాత్రమే చరణ్ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిలిం నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ram Charan: మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

Janhvi Kapoor: నెపోకిడ్ ట్యాగ్‌పై స్పందించిన జాన్వీ

Updated Date - 2023-02-09T20:54:19+05:30 IST

News Hub