Divorce: వామ్మో.. ఇలాంటి కారణాలతో కూడా విడాకులిస్తారా..? మీ భార్యలకు ఎందుకు విడాకులిచ్చారని ఆ నలుగురు భర్తలను అడిగితే..!

ABN , First Publish Date - 2023-05-07T16:11:40+05:30 IST

రీసెంట్ గా తమ భార్యలకు విడాకులు ఇచ్చిన మగమహారాజులను మీ భార్యలకెందుకు విడాకులిచ్చారని ప్రశ్నిస్తే దిమ్మతిరిగిపోయే కారణాలు చెప్పారు.

Divorce: వామ్మో.. ఇలాంటి కారణాలతో కూడా విడాకులిస్తారా..? మీ భార్యలకు ఎందుకు విడాకులిచ్చారని ఆ నలుగురు భర్తలను అడిగితే..!

'ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి' అని వాగ్దానం చేసి, ఏడడుగులతో జన్మజన్మలకు నీకు భర్తగా ఉంటానని పెళ్లి సమయంలో వరుడుప్రమాణం చేస్తాడు. అయితే ఈ ప్రమాణాలు, వాగ్దానాలు అన్నీ జీవితంలో ఎదురయ్యే సమస్యల ముందు నిలబడలేకపోతున్నాయి. ఈ కారణంగా విడాకులు(divorce) చాలా ఎక్కువ అయ్యాయి. పైకి అందరికీ చాలా చిన్నగా కనిపించే విషయాలు అనుభవించేవారికి నరకంలాగే ఉంటున్నాయట. రీసెంట్ గా తమ భార్యలకు విడాకులు ఇచ్చిన మగమహారాజులను మీ భార్యలకెందుకు విడాకులిచ్చారని ప్రశ్నిస్తే దిమ్మతిరిగిపోయే కారణాలు చెప్పారు.

33ఏళ్ళ సాహిల్ తన భార్య నుండి విడాకులు తీసుకున్నాడు. ఎందుకు విడాకులు తీసుకున్నావని అడిగితే అతను చెప్పిన కారణం 'నా భార్యకు పరిశుభ్రత ఎక్కువ' అని. ఆమెకు శుభ్రత మీద శ్రద్ద(too much interest in neatness) ఎక్కువ. ఈ కారణంగా ఆమె ఎక్కడ కొద్దిపాటి దుమ్ము, ధూళి కనిపించినా ఇక శుభ్రం చేస్తూనే ఉంటుంది. ఈ కారణం వల్ల భార్యాభర్తల మధ్య చాలాసార్లు రొమాంటిక్ సీన్స్ కూడా మధ్యలో స్పాయిల్(romantic scenes spoiled) అయ్యాయి. ఆమె శుభ్రత అనే దెబ్బకు అతనికి రొమాంటిక్ మూడ్ స్థానంలో టెన్షన్ వచ్చి పడిందట. అనుక్షణం ఆ టెన్షన్ భరించలేక అతను విడాకులు తీసుకున్నాడు.

Rapido Assault Row: రాపిడో డ్రైవర్ వేధిస్తోంటే బైక్‌పై నుంచి దూకేసిన యువతి ఘటన గుర్తుంది కదా.. తాజాగా ఆమె ఏం చేసిందంటే..!


42ఏళ్ల రాహుల్ కూడా తన భార్య నుండి విడాకులు తీసుకున్నాడు. అతను విడాకులు తీసుకోవడానికి కారణం అతని భార్య మనీ సేవింగ్స్(too much money savings) లో పరిధికి మించి ఆలోచించడమే. అనారోగ్యానికి(illness) గురైనా ఆమె డాక్టర్ దగ్గకు వెళ్లడానికి, మందులు కొనడానికి ససేమీరా ఒప్పుకోదట. ఇంటి చిట్కాలతో సమస్యను సరిపెట్టడానికి ప్రయత్నిస్తుందట. అదిమాత్రమే కాకుండ అతను మరొక దారుణమైన విషయం చెప్పాడు. గత ఆరు సంవత్సరాల కాలంలో అతను ఒక్క టూర్ కు కూడా వెళ్లలేదట. దానిక్కారణం టూర్ ల వల్ల డబ్బు వృథా అవుతుందని ఆమె కట్టడి చేయడమే.

29ఏళ్ల అభినవ్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చాడు. దీనికి కారణం ఆమె పెంచుకునే పిల్లులు(pet cats). ఇంట్లో ఎక్కడ చూసినా ఆమె పెంపుడు పిల్లుల గోలేనట. సోఫా నుండి బెడ్(sofa to bed) వరకు ఎక్కడ చూసినా పిల్లుల మాత్రం వాసనే వస్తోందట. దీంతో విసిగిపోయిన అతను నేను కావాలా? పిల్లులు కావాలా? ఏదో ఒకటి ఎంచుకో అని చెబితే ఆమె 'నీకంటే నాకు పిల్లులే ఎక్కువ' అని గంటాపథంగా చెప్పిందట. ఇంకేముంది అతను భార్యకు విడాకులు ఇచ్చేశాడు.

39ఏళ్ల ప్రీతమ్ కథ మరోలా ఉంది. ఇతనికి పెళ్లయినా అయినట్టు లేదు అంటున్నాడు. దీనిక్కారణం అతని భార్య అతనికంటే కెరీర్ కే ఎక్కువ ప్రాముఖ్యత(preference to her career) ఇస్తోంది. ఆమె ఎప్పుడూ తన పనులలో తను నిమగ్నమై ఉంటుంది. అతను చాలా సార్లు 'నాతో కూడా కొంచెం సమయం గడుపు' అని రిక్వెస్టింగ్ గానే అడిగాడు కానీ అతని భార్య మాత్రం అతన్ని పట్టించుకోలేదు. దీంతో అతను భార్యనుండి విడిపోవడానికి నిర్ణయించుకుని విడాకులు ఇచ్చేశాడు.

Viral News: తెలిసిన కుర్రాడు ఒక్కడే అద్దెకు ఉంటున్నాడని.. కలిసేందుకు భార్యతో సహా వెళ్లిన బంధువుకు షాక్.. తలుపులు తీసి చూస్తే..!


Updated Date - 2023-05-07T16:11:40+05:30 IST