Share News

Health Facts: మీరు పెరుగు ఎక్కువగా తింటుంటారా? అయితే ఇలా మాత్రం తినకండి.. ఎలాంటి సమస్యలు వస్తాయంటే..

ABN , First Publish Date - 2023-10-20T19:58:46+05:30 IST

మనదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పెరుగును ఇష్టంగా తినేవారు చాలా ఎక్కువగా ఉంటారు. చాలా మంది పెరుగును తన భోజనంతో పాటు తీసుకుంటారు. కొందరు మాత్రం పెరుగును నేరుగా తింటుంటారు. అలా కేవలం పెరుగు మాత్రమే తినే సమయంలో దానికి ఉప్పు, పంచదార, బెల్లం వంటివి కలిపి తీసుకుంటుంటారు.

Health Facts: మీరు పెరుగు ఎక్కువగా తింటుంటారా? అయితే ఇలా మాత్రం తినకండి.. ఎలాంటి సమస్యలు వస్తాయంటే..

మనదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పెరుగు (Curd)ను ఇష్టంగా తినేవారు చాలా ఎక్కువగా ఉంటారు. చాలా మంది పెరుగును తన భోజనంతో పాటు తీసుకుంటారు. కొందరు మాత్రం పెరుగును నేరుగా తింటుంటారు (Eating Curd). అలా కేవలం పెరుగు మాత్రమే తినే సమయంలో దానికి ఉప్పు (Salt), పంచదార (Sugar), బెల్లం వంటివి కలిపి తీసుకుంటుంటారు. అయితే పెరుగుతోపాటు కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట. యవ్వనంలోనే వృద్ధాప్య ఛాయలు ముంచుకొస్తాయట. అసలు పెరుగుతో పాటు వేటిని తీసుకోకుండా ముందుగా తెలుసుకుందాం (Health Facts)..

నిజానికి పెరుగును మితంగా తీసుకుంటేనే మంచిది. పెరుగు ఎక్కువగా తీసుకుంటే చర్మ సంబంధ సమస్యలు (Skin Allergies)ఎదురవుతాయట. అలాగే పెరుగును రాత్రి వేళ్లల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదట. రాత్రివేళ పెరుగు తినడం వల్ల ఉదర సంబంధ సమస్యలు మొదలవుతాయి. పెరుగులో ఉప్పు కలుపుకుని తినడానికి ఇష్టపడే వారు పెద్ద సంఖ్యలో ఉంటారు. పెరుగులో ఉప్పు కలిపి తింటే.. జుట్టు రాలడం, చిన్నవయసులోనే జుట్టు నెరిసిపోవడం, మొహంపై మొటిమలు రావడంతో పాటు అనేక చర్మ సంబంధిత వ్యాధులు రావచ్చు. సాధారణంగా పెరుగు వేడి స్వభావం కలిగి ఉంటుంది. దానికి ఉప్పు కలిపితే మరిన్ని సమస్యలు వస్తాయి (Food and Health).

Viral Video: ఆ అమ్మాయి ప్లాన్ రివర్స్ అయింది.. రోడ్డు మధ్యలో అమ్మాయి డ్యాన్స్.. కానీ, వెనక తాగి ఉన్న వ్యక్తిని చూసి..

పెరుగులో పంచదార లేదా బెల్లం కలిపి తినడం కూడా అంత మంచిది కాదు. అలా తినడం వల్ల ఎసిడిటీ (Acidity)సమస్యలు వస్తాయి. పులుపు, తీపి కలిపి తీసుకోవడం జీర్ణాశయానికి చాలా హాని కలగచేస్తుందట. ఇక, చాలా మంది వేసవి కాలంలో పెరుగును ఎక్కువగా తీసుకుంటారు. ఏ సీజన్ అయినా పెరుగును మితంగానే తీసుకోవాలని, మోతాదు మించితే యవ్వనంలోనే వృద్ధాప్య ఛాయలు ముంచుకొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2023-10-20T19:59:04+05:30 IST