ఆ ఊరి జనం 45 ఏళ్లుగా ఉల్లికి దూరం... కారణమిదే!
ABN , First Publish Date - 2023-04-13T13:58:09+05:30 IST
ఉల్లి, వెల్లుల్లి ధరల పెరుగుదల, తగ్గుదల కారణంగా అవి ఎల్లప్పుడూ వార్తల ముఖ్యాంశాలలో కనిపిస్తాయి. వీటిని చాలామంది తమ ఇళ్లలో అనునిత్యం ఉపయోగిస్తుంటారు.
ఉల్లి, వెల్లుల్లి ధరల పెరుగుదల, తగ్గుదల కారణంగా అవి ఎల్లప్పుడూ వార్తల ముఖ్యాంశాలలో కనిపిస్తాయి. వీటిని చాలామంది తమ ఇళ్లలో అనునిత్యం ఉపయోగిస్తుంటారు. ఉల్లి-వెల్లుల్లి(Onion-Garlic) వాడకం వల్ల ఆహారం రుచి పెరుగుతుంది. ఇవి రోగనిరోధక శక్తి(Immunity)పై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కాలానుగుణ వ్యాధుల(Seasonal diseases) ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ చాలా మంది వీటికి దూరంగా ఉంటారు. కాగా వెల్లుల్లి, ఉల్లిపాయలను గత 45 సంవత్సరాలుగా ఉపయోగించని గ్రామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ గ్రామంలోని ప్రజలంతా తమ ఇళ్లలో వెల్లుల్లి-ఉల్లిపాయలకు దూరంగా ఉంటారు. అదే బీహార్‌లోని జెహనాబాద్(Jehanabad) సమీపంలోన ఒక గ్రామం. చిరి పంచాయితీ పరిధిలోకి వచ్చే త్రిలోకి బిఘా గ్రామమే అది. ఈ గ్రామం జెహనాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ నుండి 30 కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామంలో 30 నుండి 35 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడి అన్ని ఇళ్లలో ఉల్లిపాయలు, వెల్లుల్లి తినడంపై నిషేధం ఉంది. ఇక్కడి ప్రజలంతా ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఆహారం(food) తీసుకుంటారు.
సుమారు 45 సంవత్సరాల క్రితం నుంచి ఈ గ్రామంలోని ప్రజలు ఉల్లిపాయలు, వెల్లుల్లి తినడం మానేశారని, ఇక్కడి ప్రజలు(people) చాలా కాలంగా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారని త్రిలోకి బిఘా గ్రామ పెద్దలు తెలిపారు. వారు పేర్కొన్న వివరాల ప్రకారం గ్రామంలో ఠాకూర్‌బడి దేవాలయం(Thakurbadi Temple) ఉంది. ఇది చాలా పురాతనమైనది. ఈ ఆలయం కారణంగా ప్రజలు వెల్లుల్లి, ఉల్లిపాయలకు దూరంగా ఉంటారు. కొందరు ఈ సంప్రదాయాన్నిఉల్లంఘించడానికి ప్రయత్నించినప్పుడు వారి ఇళ్లలో పలు అవాంఛనీయ సంఘటనలు(Adverse events) చోటుచేసుకున్నయని గ్రామస్తులు చెబుతుంటారు. ఈ ఘటనల తర్వాత ఇక్కడి ప్రజలు వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం మానేశారు. ఈ గ్రామంలో వెల్లుల్లి, ఉల్లి మాత్రమే కాదు, మాంసం(meat), మద్యం కూడా నిషేధించారు.